AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?

ఈ భూమ్మీద సూర్యుడు అస్త‌మించ‌ని ప్రాంతాలు కొన్ని ఉన్నాయ‌న్న సంగ‌తి మీకు తెలుసా. అర్ధ‌రాత్రి అయినా కూడా అక్క‌డ ప‌ట్ట‌ప‌గల్లాగానే ఉంటుంది. ఇవి ఇండియాలో కాదులేండి. మరెక్కడ అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా.. అయితే ఈ దేశాల గురించి తెలుసుకోవాల్సిందే. నిరంతరం సూర్యుడు అందుబాటులో ఉండే ప్రాంతాలేవో ఇప్పుడు చూద్దాం..

Prudvi Battula
|

Updated on: Dec 05, 2025 | 4:33 PM

Share
నార్వే: ఏడాదిలో చాలా కాలం పాటు నార్వేలో సూర్యుడు అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా ప‌ట్ట‌ప‌గ‌లు లాగా ఎండ ఉంటుంది. అందుకే నార్వే దేశాన్ని అర్ధ‌రాత్రి సూర్యుడు ఉద‌యించే ప్రాంతం Land Of Midnight Sun అని కూడా పిలుస్తారు. అక్షాంశానికి ఎక్కువ ఎత్తులో ఉండ‌టం వ‌ల్లే అక్క‌డ కొద్దిరోజుల పాటు సూర్యుడు అస్త‌మించ‌డు. మే నుంచి జూలై మ‌ధ్య‌లో దాదాపు 70 రోజుల పాటు సూర్యుడు నిరంత‌రం ప్ర‌కాశిస్తూనే ఉంటాడు. ఒక రోజులో కేవ‌లం నాలుగు గంట‌లు మాత్రం మ‌బ్బుల చాటుకు వెళతాడట. నార్వేలోని స్వాల్ బార్డ్‌లో ఏప్రిల్ 10 నుంచి ఆగ‌స్టు 23 వ‌ర‌కు సూర్యుడు నిరంత‌రం ప్ర‌కాశిస్తూనే ఉంటాడు.

1 / 7
ఫిన్లాండ్‌: అంద‌మైన స‌ర‌స్సులు, ద్వీపాల‌కు పెట్టింది పేరైన ఫిన్లాండ్‌ లోనూ సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఈ దేశంలో ఎండాకాలంలో 70 రోజుల పాటు సూర్యుడు అస‌లు అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా ప‌ట్ట‌ప‌గ‌ల్లాగే ఉండటం అక్కడ విశేషం. అయితే చలికాలంలో మాత్రం అక్కడ అస‌లు సూర్యుడి జాడే క‌నిపించ‌దు.

2 / 7
ఐస్‌లాండ్‌: యూర‌ప్‌లో ఉన్న అతిపెద్ద ద్వీపం ఐస్‌లాండ్‌. అక్క‌డ నివాస ప్రాంతాలు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ర్యాట‌కంగా దీనికి మంచి ఆద‌ర‌ణ ఉంది. అక్క‌డ జూన్ నెల‌లో సూర్యుడు అస్త‌మించడు. ఆ నెల రోజులు ప‌గ‌లు, రాత్రికి అస్సలు తేడా ఉండ‌దు. అందుకే జూన్ నెల‌లో ఇక్కడికి ప‌ర్యాట‌కులు ఎక్కువ‌గా వ‌స్తుంటారు. ఐస్‌లాండ్‌లో దోమ‌లు కూడా ఉండ‌వు.

3 / 7
కెన‌డా: కెనడాలోని యుకోన్‌లో ఏడాది పొడ‌వునా మంచు కురుస్తూనే ఉంటుంది. అయితే 50 రోజులు మాత్రం వేస‌వి కాలం ఉంటుంది. ఈ కాలంలో అర్ధ‌రాత్రి కూడా సూర్యుడు ఉద‌యిస్తూనే ఉంటాడు. అందుకే ఆ 50 రోజుల్లో అనేక పండుగ‌లు, ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు అక్కడి వారు. ఇందులో భాగంగానే ప్ర‌తి ఏటా జూలై మ‌ధ్య‌లో గ్రేట్ నార్త‌ర్న్ ఫెస్టివ‌ల్ కూడా జ‌రుపుకుంటారు. గోల్ఫ్ ఈవెంట్లు కూడా నిర్వ‌హిస్తారు. చ‌లికాలంలో మాత్రం నునావ‌ట్‌లో 30 రోజుల పాటు సూర్యుడు క‌నిపించ‌డు.

4 / 7
స్వీడ‌న్‌: స్వీడ‌న్‌లోని కిరున్ న‌గ‌రంలో ఏడాదిలో దాదాపు వంద రోజుల పాటు సూర్యుడు అస్త‌మించ‌డు. మే నుంచి ఆగ‌స్టు మ‌ధ్య‌లో సూర్యుడు ఎప్పుడూ ప్ర‌కాశిస్తూనే ఉంటాడు. అందుకే ఈ స‌మ‌యంలో ఈ న‌గ‌రాన్ని చూసేందుకు ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తుంటారు. దీంతోపాటు కిరున్ ఆర్ట్ నోయువే చ‌ర్చి కూడా చాలా పాపుల‌ర్‌. ఈ చ‌ర్చి ఆర్కిటెక్చ‌ర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే కిరున్‌లోని ఈ చ‌ర్చిని చూసేందుకు అనేక మంది టూరిస్టులు అక్కడికి వస్తుంటారు.

5 / 7
అలాస్కా: అమెరికాకు చెందిన‌ అలాస్కాలోని బారోలో మే నుంచి జూలై వ‌ర‌కు సూర్యుడు అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా సూర్యుడు వెలుగులు విర‌జిమ్ముతూనే ఉంటాడు. కానీ న‌వంబ‌ర్ నెల‌లో 30 రోజులు మాత్రం చీక‌టిగా ఉంటుంది. దీన్నే పోలార్ నైట్ అని పిలుస్తారు.

6 / 7
కానాక్‌, గ్రీన్‌లాండ్‌: గ్రీన్‌లాండ్‌లో ఉత్త‌రంవైపు ఉండే కానాక్ న‌గ‌రం.. చలికాలంలో పూర్తిగా చీక‌ట్లోనే ఉంటుంది. అదే వేస‌వికాలంలో ఏప్రిల్ నుంచి ఆగ‌స్టు మ‌ధ్య మాత్రం సూర్యుడు రోజంతా ప్ర‌కాశిస్తూనే ఉంటాడు. ఇలా ప్రపంచంలోని అనేక దేశాల్లో సూర్యుడు నిరంతరాయంగా ఉదయించే ఉంటాడు.

7 / 7
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర

రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ

క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?

కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..

లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే

ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు

యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..