Andhra Pradesh: అయ్యో దేవుడా.. ఇంటర్వ్యూకి హాజరై చంటిబిడ్డతో ఇంటికి బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని ప్రమాదం..
హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరారు.. విజయవాడ దాటారు.. మరికాసేపట్లో ఇంటికి చేరుకునే వారు.. ఈ క్రమంలోనే రెప్పపాటులో మూడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. విజయవాడ - రాజమండ్రి హైవేపై ఏలూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు..
హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరారు.. విజయవాడ దాటారు.. మరికాసేపట్లో ఇంటికి చేరుకునే వారు.. ఈ క్రమంలోనే రెప్పపాటులో మూడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. విజయవాడ – రాజమండ్రి హైవేపై ఏలూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు… ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద సోమవారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటలో ముగ్గురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తూర్పుగోదావరి జిల్లా రాజవోలికి చెందిన రాచబత్తుని భాగ్యశ్రీ (26), రాచనిబత్తుని నితిన్ కుమార్ (2), పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన బొమ్మా కమలాదేవి (53) హైదరాబాద్ నుంచి రాజవోలుకు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో కారు.. మండలంలోని ఏలూరు లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. కారు వేగంగా వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. నాగషణ్ముక్, డ్రైవర్ వంశీ తీవ్రంగా గాయపడ్డారు.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. భాగ్యశ్రీ హైదరాబాద్‌లోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..