Hyderabad: బరితెగించిన సైబర్ బూచోళ్లు.. మెయిల్‌ హ్యాక్‌ చేసి ఏకంగా రూ.11.4 కోట్లు దోచేశారు!

అమాయకులను దోచుకోవడానికి సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు పంథా మార్చుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా బ్యాంకు ఖాతాలు మారాయంటూ ఓ సంస్థను భారీ మొత్తంలో మోసం చేశారు. సైబర్‌ నేరస్థులు ఓ నకిలీ మెయిల్‌ పంపించగా.. దాన్ని గుడ్డిగా నమ్మిన సంస్థ నిర్వాహకులు వాళ్లు అడిగిన వివరాలు ఇచ్చేశారు. ఇంకేముంది క్షణాల్లో సంస్థ బ్యాంకు ఖాతా నుంచి రూ.11.4 కోట్లు కొట్టేశారు..

Hyderabad: బరితెగించిన సైబర్ బూచోళ్లు.. మెయిల్‌ హ్యాక్‌ చేసి ఏకంగా రూ.11.4 కోట్లు దోచేశారు!
Cyber Criminals
Follow us

|

Updated on: Jul 08, 2024 | 10:13 AM

హైదరాబాద్‌, జూలై 8: అమాయకులను దోచుకోవడానికి సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు పంథా మార్చుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా బ్యాంకు ఖాతాలు మారాయంటూ ఓ సంస్థను భారీ మొత్తంలో మోసం చేశారు. సైబర్‌ నేరస్థులు ఓ నకిలీ మెయిల్‌ పంపించగా.. దాన్ని గుడ్డిగా నమ్మిన సంస్థ నిర్వాహకులు వాళ్లు అడిగిన వివరాలు ఇచ్చేశారు. ఇంకేముంది క్షణాల్లో సంస్థ బ్యాంకు ఖాతా నుంచి రూ.11.4 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌లో ఈ షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలోని ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఉంది. అక్కడ ఆంకాలజీ, ఆప్తాలమిక్స్, హార్మోనల్‌ ఉత్పత్తుల్ని తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీలో ఇంటర్నల్‌ క్వాలిటీ కంట్రోల్‌ విషయాలకు సంబంధించి సంస్థకు ముడిసరకును సరఫరా చేసే వారి లావాదేవీలు ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతుంటాయి. ఇలా ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించే ప్రక్రియను ఓ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ చూస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే 11న లైఫ్‌సైన్సెస్‌ సంస్థ పేరిట సదరు ఫార్మా కంపెనీకి ఓ మెయిల్‌ వచ్చింది. తమ సంస్థ బ్యాంకు ఖాతాలు మారాయని, కంపెనీ నుంచి రావాల్సిన సొమ్మును వేరే రెండు బ్యాంకు ఖాతాలకు పంపించాలనేది ఆ మెయిల్‌ సారాంశం. ఈ మెయిల్‌ తమ కంపెనీ లావాదేవీలు చూస్తున్న లైఫ్‌సైన్సెస్‌ సంస్థ పంపించిందని భావించిన కంపెనీ నిర్వాహకులు.. మెయిల్‌లో సూచించిన ఖాతాలకు 13,67,195 అమెరికన్‌ డాలర్లను పంపించారు.

అయితే అదే నెల 16వ తేదీన ముడిసరకు సరఫరాదారులకు తమకు ఇంకా పేమెంట్‌ అందలేదంటూ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ నుంచి ఫార్మా కంపెనీకి ఫోన్‌ వచ్చింది. మెయిల్‌లో అకౌంట్లు మారాయని, వేరే అకౌంట్‌ నంబర్లు మీరే ఇచ్చారని, అలా ఇచ్చిన రెండు బ్యాంకు ఖాతాలకు ఐదు రోజుల క్రితమే డబ్బులు పంపించామని కంపెనీ ప్రతినిధులు బదులిచ్చారు. ఇక్కడే అసలు విషయం బయటపడి ఖంగుతిన్నారు. తాము అసలు ఎలాంటి మెయిల్‌ పంపలేదని లైఫ్‌సైన్సెస్‌ సంస్థ ప్రతినిధులు చెప్పడంతో ఫార్మా కంపెనీ ప్రతినిధులకు దిమ్మతిరిగింది. ఇదంతా సైబర్‌ హ్యాకర్లు చేసిన పని అని తెలుసుకున్న కంపెనీ చేసేదిలేక పోలీసులను ఆశ్రయించారు. తప్పుడు మెయిల్‌ పంపించి ఏకంగా రూ.11.4 కోట్లు తస్కరించినట్లు గుర్తించిన ఫార్మా కంపెనీ తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)కు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్‌ బ్రాంచ్‌ దర్యాప్తు ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..