Shawarma: షావర్మా.. తింటే మీ కర్మ.. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో దడపుట్టించే నిజాలు..!

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి.. అబ్బ ఇదెక్కడో విన్నాం అనుకుంటున్నారా.. ఇది మన పెద్దలు తరచూ వాడే సామేత.. ఎవరి రుచులు వారివి.. మనుషులు అందరూ ఒక్కటి కాదు.. ఎవరి బుద్దులు వారివి.. అనే అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.. మనిషి ఆలోచనలు.. ప్రవర్తనలు వేరు వేరుగా ఉంటాయి. అందరిలా ఆలోచిస్తే మన ప్రత్యేకత ఏముంటుంది.. అలాగే ప్రతి ఒక్కరికీ.. ఒక్కో రుచి నచ్చుతుంటుంది.

Shawarma: షావర్మా.. తింటే మీ కర్మ.. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో దడపుట్టించే నిజాలు..!
Shawarma
Follow us

| Edited By: Ravi Panangapalli

Updated on: Jul 10, 2024 | 8:30 AM

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి.. అబ్బ ఇదెక్కడో విన్నాం అనుకుంటున్నారా.. ఇది మన పెద్దలు తరచూ వాడే సామేత.. ఎవరి రుచులు వారివి.. మనుషులు అందరూ ఒక్కటి కాదు.. ఎవరి బుద్దులు వారివి.. అనే అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.. మనిషి ఆలోచనలు.. ప్రవర్తనలు వేరు వేరుగా ఉంటాయి. అందరిలా ఆలోచిస్తే మన ప్రత్యేకత ఏముంటుంది.. అలాగే ప్రతి ఒక్కరికీ.. ఒక్కో రుచి నచ్చుతుంటుంది. ఊదాహరణకు.. కొందరు నాన్ వెజ్ ఇష్టంగా లాగించేస్తుంటారు.. మరికొందరికి అస్సలు నాన్ వెజ్ అంటేనే గిట్టదు.. ముట్టుకోరు.. ఇంకా కొందరు రెండూ తింటారు.. ఏవేవో స్వీట్లను, స్పైసీ ఫుడ్ ను ఇష్టపడుతుంటారు.. రోజూ టేస్ట్ చేసే వంటకాలేగా.. కాస్త విభిన్నంగా ట్రై చేస్తూ ఆయా టెస్ట్‌లను ఆస్వాదిస్తుంటారు. అందుకే.. ఎవరి రుచి వాళ్లది.. మనం ఏం అనడానికి వీల్లేదు.. అలా కాదు వారి అభిప్రాయాలను ప్రశ్నిస్తే మాత్రమ.. పరిస్థితులు మారాయి.. దానికి అనుగుణంగా మన లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలంటూ సూక్తులు చెబుతుంటారు..

ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి ముందుకెళ్తే.. పిజ్జాలు, బర్గర్లు, పానీపూరి, కబాబ్స్, షావర్మా.. అబ్బో ఇలా ఎన్నో టేస్ట్ చేయడానికి ట్రెండీ ఆహార పదార్థాలు ఉన్నాయి.. ముఖ్యంగా పానీ పూరి బండి కనిపించినా.. షావర్మా షాపు కనిపించినా చాలా మందికి నోరురుతుంది.. ఇంకేముంది.. అక్కడికి వెళ్లి లొట్టలేసుకుంటూ మరి లాగించేస్తుంటారు.. అయితే.. అలాంటి వారికి మనం ఎన్ని చెప్పినా ఎక్కదు గాక ఎక్కదు.. ఎందుకంటే.. మేం తింటున్నామని అలా అంటున్నారు.. అంటూ సింపుల్ గా చెప్పేస్తారు.. కానీ.. ఇప్పుడు చెప్పబోయేది తెలిస్తే.. ఒక్కసారిగా గుటకలేస్తారు.. ఎందుకంటే.. జనం రోడ్ల వెంట ఇష్టంగా తినే కబాబ్స్, పానీపూరిలతో పాటు షావర్మాలతో ప్రాణాంతక బ్యాక్టీరియా, ఈస్ట్ (ఫంగస్- పులిసి పోయిన ఆహారంపై ఉండే బ్యాక్టీరియా) ఉన్నట్లు పరీక్షల్లో నిర్థారణ అయ్యింది.

Shawarma3

Shawarma

వాస్తవానికి వీధుల్లో దొరికే ఆహారాలు మనకు ఎక్కువగా నోరూరిస్తాయి.. అన్నింటికంటే అవి చాలా రుచికరంగా.. ఘుమఘుమలాడుతూ అట్రాక్ట్ చేస్తుంటాయి.. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలం సీజన్‌లలో వాటిని ఆస్వాదిస్తూ తినడం భిన్నమైన కిక్.. పానీ పూరీ నుంచి షావర్మా వరకు ఎన్నో ఎంపికలు ఉన్నాయి.  అవి పూర్తిగా రుచికరంగా ఉన్నప్పటికీ, ఈ సీజన్‌లో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కాలుష్యం.. బ్యాక్టీరియాతో పాటు కల్తీ ప్రమాదం తరచుగా ఫుడ్ పాయిజనింగ్, ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలిన షాకింగ్ నిజాలు..

ఇదేదో మేం చెబుతున్నది కాదు.. స్వయంగా ప్రభుత్వ అధికారులు చెబుతున్నదే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)ఇటీవల కర్ణాటకలో ఆహార నమూనాలను సేకరించి వాటి నాణ్యతను తనిఖీ చేసింది. ఇటీవల దాడులు చేసి సేకరించిన షాంపిళ్ల ఆధారంగా.. షావర్మాలో హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ఘాంతపోయే విషయాలను వెల్లడించింది.. ఫుడ్ సెఫ్టీ అధికారులు కర్ణాటక రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి షావర్మా నమూనాలను సేకరించారు.. వీటిలో బృహత్ బెంగళూరు నగరంలో పలు ఫేమస్ రెస్టారెంట్లు సైతం ఉన్నాయి. చాలా నమూనాలు నాణ్యత లేనివి, మానవ ఆరోగ్యానికి ప్రమాదకరమని కనుగొన్నారు. 17 శాంపిల్స్‌లో 8 అపరిశుభ్ర స్థితిలో ఉన్నట్లు తేలింది. ఇవి హానికరమైన బ్యాక్టీరియా, ఈస్ట్‌తో ఉండటమే కాకుండా.. కల్తీతో తయారు చేశారని.. ఇవి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నివేదకలో తెలిపింది.

అంతకు ముుందు పానీ పూరీ స్టాల్స్, కొన్ని ప్రసిద్ధ తినుబండారాల శ్యాంపిల్స్‌ను కూడా FSSAI పరీక్షించింది. కర్ణాటకలోని 79 ప్రదేశాల నుండి పానీ పూరీ నమూనాలు తీసుకున్నారు. వీటిలో 41 నమూనాల్లో మనిషి ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగించే కృత్రిమ రంగులున్నాయని తేలింది. అంతే కాదు వాటిలో 18 శాంపిల్స్ నాణ్యత లేనివిగానూ బ్రిలియంట్ బ్లూ, సన్‌సెట్ ఎల్లో, టార్టరాజైన్ వంటి హానికరమైన రసాయనాలతో నిండి ఉన్నాయని నివేదికలో తెలిపింది.. ఫిర్యాదుల వస్తున్న నేపథ్యంలో ఎన్నో తినుభండారాలను రోడ్‌సైడ్, ప్రసిద్ధ రెస్టారెంట్ల వరకు అన్ని చోట్ల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. అందులో పానీపూరీ, షావర్మా, కబాబ్‌లు, గోబీ మంచూరియన్, కాటన్ క్యాండీ, బెంగాల్ స్వీట్‌లు నాణ్యతలేనివిగా పరీక్షల్లో గుర్తించారు.

Shawarma

Shawarma

బ్రిలియంట్ బ్లూ, సన్‌సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ వంటి సింథటిక్ కృత్రిమ రంగులను ఉపయోగించడం వల్ల .. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు సైతం వచ్చే అవకాశం ఉంది.. ఇవి కడుపు నొప్పి నుంచి గుండె జబ్బుల వరకు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.. ఇంకా రసాయనాల అధిక వినియోగం గుండె జబ్బులు, ఆటో-ఇమ్యూన్ డిజార్డర్‌తో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల డయేరియా, టైఫాయిడ్, జాండిస్ వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అవి రంగులు కాదు.. హానికర రసాయనాలు..

బ్రిలియంట్ బ్లూ, సన్‌సెట్ ఎల్లో ( ఫుడ్ ఆరెంజ్ కలర్ రావడం కోసం ఉపయోగించే రసాయనం), టార్ట్రాజైన్ (పసుపు రంగులో పొడి, కణికలు లేదా ద్రావణం) వంటి రసాయనాలు టేస్ట్ కోసం ఉపయోగించే నూనెలు, కల్తీ మసాలా దినుసులను ముఖ్యంగా ప్రాసెస్సెడ్ ఫుడ్ షావర్మా తయారీలో ఉపయోగిస్తారు. సౌందర్య సాధనాల్లో ఉపయోగించే సింథటిక్ రంగు.. ఆహారంలో అధికంగా ఉపయోగించడం వల్ల అలెర్జీ, దురద లాంటివి వస్తాయి.. ఇది పిల్లలకు మంచిది కాదు.. వారిలో హైపర్ యాక్టివిటీ.. మానసిక శ్రద్ధ-సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.. బ్రిలియంట్ బ్లూను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల కొన్నిసార్లు కడుపు నొప్పి, వికారం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. ఈ ప్రభావాలు సాధారణంగా అరుదుగా ఉంటాయి.. అధిక వినియోగంతో కొన్ని సార్లు ప్రమాదకరంగా మారవచ్చు..

ఫేమస్ స్ట్రీట్ ఫుడ్.. షావర్మా ఎలా తయారు చేస్తారు..?

షావర్మా అనేది మధ్యప్రాచ్య వంటకం.. మధ్య ఆసియా దేశాల్లో లభించే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్.. అక్కడ దీనిని చిరుతిండిగా తీసుకుంటారు.. ఇది సాధారణంగా మాంసం (గొర్రె, గొడ్డు మాంసం, చికెన్ లేదా టర్కీ కోళ్ల మాంసం) తో తయారుచేస్తారు.. వాస్తవానికి ఇక్కడి వాతావరణానికి షవర్మా బాగుండదన్న అభిప్రాయాలు ఎప్పటినుంచో వ్యక్తమవుతున్నాయి. ముందుగా మాంసాన్ని పెరుగు మసాలా దినుసులతో మెరినెట్ చేస్తారు. కొన్నిగంటల తర్వాత పలు రకాల కూరగాయలతో మాంసాన్ని పేర్చి.. ఆ తర్వాత అధిక ఉష్ణోగ్రత మధ్య చుట్టూ కాలుస్తారు.. దానిని ముక్కలుగా కట్ మళ్లీ సింథటిక్ మసాలా దినుసులను చల్లి.. గోధుమ పిండి లేదా మైదాతో చేసి రోటిపై దానిని ఉంచి రోల్ గా చేసి సర్వ్ చేస్తారు.

వాస్తవానికి ఇది మధ్య ఆసియా దేశాల్లో లభించే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్… ఇక్కడ దీనిని తయారు చేసే వారు బయట ఉంచడం ద్వారా షావర్మాపై దుమ్ము, ధూళి వచ్చి చేరుతుంది.. ఇంకా షావర్మా గంటల తరబడి అలా ఉంచడం వల్ల దానిలోకి హానికరమైన బ్యాక్టీరియా, ఈస్ట్ చేరుతుంది.. ఇంకా ఎక్కువగా కాల్చడం వల్ల ఇది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.. పైగా కల్లీ పదార్థాలు, నూనెలు, నాణ్యత లేని చికెన్ ఇవన్నీ కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంచూపుతున్నాయి.

షావర్మా తిని ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎందరో..

షావర్మా అమ్మకాలను సరిగా నిర్వహించరు.. దీనివల్ల షావర్మా తిని చాలామంది ప్రజలు అనారోగ్యం బారిన పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందరు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.. షావర్మా తిన్న తర్వాత ఫుడ్‌ పాయిజనింగ్‌.. కడుపునొప్పి, వాంతులతో చనిపోయిన కేసులు మన దేశంలోనే వెలుగు చూశాయి.. అంతేకాకుండా వందలాది మంది ఆస్పత్రి పాలైన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఎక్కడపడితే అక్కడ షవర్మా తినే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఏడాది మే నెలలో ముంబైకి చెందిన 19 ఏళ్ల యువకుడు రోడ్డు పక్క చికెన్ షావర్మా తిని మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు షాపు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 304, 34 కింద కేసు నమోదు చేశారు. అలాగే ఏప్రిల్ మాసంలో ముంబైలోనే ఓ షావర్మా స్టాల్‌లో చికెన్ షావర్మా తిని 12 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు విస్తృత తనిఖీలు చేపడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ఆ తర్వాత సైలెంట్ అయిపోతున్నారు.

Shawarma2

Shawarma

అసలు షావర్మా మంచిదేనా..

షావర్మా అనేది సమతుల్య భోజనం లాంటిది.. ఇది అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది. అయినప్పటికీ, మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.. ఎందుకంటే అధిక వినియోగం పెరిగిన సోడియం, సంతృప్త కొవ్వు, అధిక కేలరీలు అందిస్తుంది. షావర్మాలో ఉపయోగించే కొవ్వు మాంసాలలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.. దీనిని ఎక్కువగా తీసుకుంటే గుండె సమస్యలకు దారి తీస్తుంది.

షావర్మా నిర్వహణ సరిగా లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుంది.. దీంతో వికారం, వాంతులు, అతిసారం, తీవ్రమైన అనారోగ్యం, బలహీనత, తలనొప్పి, కడుపు నొప్పి, శరీర ఉష్ణోగ్రత పెరుగుదల, కామెర్లు లాంటి వాటి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కావున, ఇలాంటి బయట తినడం కంటే.. ఇంట్లో తయారుచేసుకొని తినడం మంచిదని.. దీనివల్ల ఆనారోగ్యకరమైన పదార్ధాలను తినడాన్ని నివారించవచ్చని పేర్కొంటున్నారు. అందుకే.. స్ట్రీట్ ఫుడ్ తినే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యానికి, ప్రాణానికి మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం