Viral Video: వామ్మో కేటుగాడు..’హిప్నోటైజ్’ చేసి కోబ్రాను ఎలా లొంగదీసుకున్నాడో చూడండి! వీడియో

గారడీలు చేసే వ్యక్తులు వారి మాయమాటలతో సులువుగా ఎదుటి వారిని బురిడీ కొట్టించేస్తుంటారు. అది వారికి వెన్నతో పెట్టిన విద్య మరి. మరికొందరేమో ఏకంగా హిప్నటైజ్‌ చేసి మనల్ని వారి నియంత్రణలోకి తీసుకుంటారు. అయితే ఇలాంటి మ్యాజిక్‌లు, హిప్నోటైజ్ ట్రిక్‌లు మూగ జీవాలపై పనిచేస్తాయా? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా.. అయితే మీరీ వీడియో చూడాల్సిందే..

Viral Video: వామ్మో కేటుగాడు..'హిప్నోటైజ్' చేసి కోబ్రాను ఎలా లొంగదీసుకున్నాడో చూడండి! వీడియో
How To Hypnotising Snake
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 09, 2024 | 11:37 AM

గారడీలు చేసే వ్యక్తులు వారి మాయమాటలతో సులువుగా ఎదుటి వారిని బురిడీ కొట్టించేస్తుంటారు. అది వారికి వెన్నతో పెట్టిన విద్య మరి. మరికొందరేమో ఏకంగా హిప్నటైజ్‌ చేసి మనల్ని వారి నియంత్రణలోకి తీసుకుంటారు. అయితే ఇలాంటి మ్యాజిక్‌లు, హిప్నోటైజ్ ట్రిక్‌లు మూగ జీవాలపై పనిచేస్తాయా? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా.. అయితే మీరీ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే వీడెవడో గుండెలు తీసిన బంటులా ఉన్నాడండీ.. ఏకంగా తన ట్యాలెంట్ను కింగ్‌ కోబ్రాపైనే వాడేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి ముందు భారీ కింగ్‌ కోబ్రా పడగవిప్పి బుసలు కొడుతూ ఉండటం కనిపిస్తుంది. అయితే అతగాడు మాత్రం దాని కోపాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఏవో మాటలు మాట్లాడుతూ మెల్లగా దాని దగ్గరికి వచ్చి తన చేతిని చాచి ‘హిప్నోటైజ్’ చేయడం ఎలా చేయడం కనిపిస్తుంది. తొలుత కొంచెం బెట్టు చేసినా.. ఆ తర్వాత మెల్లగా యామగాడి వలలో కోబ్రా పడిపోతుంది. కోబ్రా, సదరు వ్యక్తి ఒకళ్లనొకళ్లు తదేకంగా చూసుకోవడం వీడియోలో చూడొచ్చు. అనంతరం మెల్లగా కోబ్రా అతని అధీనంలోకి వెళ్లిపోయి.. అతగాడు చెప్పినట్లు చేయడం చేస్తుంది. అతను పామును వశీకరణ చేస్తున్నప్పుడు, తన నోటి నుంచి పొగను మెల్లమెల్లగా వదలడం వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇదే అదనుగా భావించిన అతను చేతిని పాము ముందుకి చాచి కోబ్రా తలపై భాగంలో నిమిరి.. నిమిరి.. ఒక్కసారిగా దాని పీక పట్టేస్తాడు. పాపం.. ఈ ఊహించని ఘటనకు కోబ్రా బిక్కసచ్చిపోతుంది. అతని చేతిలో గిలగిలలాడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ వ్యక్తి ఆఫ్రికన్ మాయాజాలాన్ని ప్రయోగించాడని ఒకరు, చాలా నైపుణ్యంగా పట్టుకున్నాడు. క్రేజీ, డేంజరస్ అండ్ బ్యూటిఫుల్ ఎగ్జిక్యూట్ అంటూ మరొకరు, అతను నిజమైన ఆఫ్రికన్. నేనూ ఆఫ్రికన్ అయినందుకు చాలా గర్వపడుతున్నానంటూ ఇంకొకరు కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటికే 5.4 మిలియన్ల వీక్షణలు, లక్షల్లో లైకులు రావడంతో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్‌ ఆర్టికల్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.