Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ సింగర్ భర్త కన్నుమూత.. క్షణాల్లో ముంచుకొచ్చిన మృత్యువు!

ప్రముఖ సింగర్‌ ఉషా ఉతుప్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త జాని చాకో ఉతుప్‌ (78) సోమవారం రాత్రి హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం రాత్రి జానీ చాకో టీవీ చూస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటీన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. కానీ అప్పటికే ఆలస్యమైంది..

ప్రముఖ సింగర్ భర్త కన్నుమూత.. క్షణాల్లో ముంచుకొచ్చిన మృత్యువు!
Singer Usha Uthup Husband Jani Chacko Uthup
Srilakshmi C
|

Updated on: Jul 09, 2024 | 1:28 PM

Share

ప్రముఖ సింగర్‌ ఉషా ఉతుప్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త జాని చాకో ఉతుప్‌ (78) సోమవారం రాత్రి హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం రాత్రి జానీ చాకో టీవీ చూస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటీన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. కానీ అప్పటికే ఆలస్యమైంది. జానీ చాకో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు జానీ చాకో మృతి చెందిన వార్తను ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. ఉషా ఉతుప్‌కు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. నేడు జానీ చాకో అంత్యక్రియలు కోల్‌కతాలో నిర్వహించనున్నారు.

కుమార్తె అంజలి ఉతుప్ తండ్రికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ‘అప్పా… చాలా త్వరగా వెళ్ళిపోయావు. కానీ నువ్వు జీవించినంత స్టైలిష్‌గా.. ప్రపంచంలోనే అత్యంత అందమైన మనిషిని.. మేము మిస్‌ అవుతున్నాం. ట్రూ జెంటిల్‌మెన్‌, లారెన్సియన్ టు కోర్ అండ్ ది ఫైనెస్ట్ టీ టేస్టర్’ అని అంజలి ఉతుప్‌ తన పోస్టులో తండ్రి మరణం పట్ల తీవ్ర ఆవేధనను వ్యక్తం చేసింది. కాగా గాయని ఉషా ఉతుప్‌కు జానీ చాకో రెండో భర్త. గతంలో రాము అనే వ్యక్తితో ఆమెకు మొదటి వివాహం జరగగా.. ఆ తర్వాత వీరు విడిపోయారు. తేయాకు తోటల రంగంలో వ్యాపారాలు కలిగిన జానీ చాకో.. 70వ దశకం ప్రారంభంలో ఐకానిక్ ట్రింకాస్‌లో ఉషను తొలిసారి కలిశారు. అనతరం కొన్నాళ్లకు వీరు వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by anjali uthup (@anjaliuthup)

ఇక ఉషా ఉతుప్‌ విషయానికొస్తే.. సంగీత ప్రపంచంలో ఆమె చేసిన సేవలు మరువలేనివి. 2011లో పద్మశ్రీతో, 2023లో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో భారత సర్కార్‌ ఆమెను సత్కరించింది. నేటికి ఆమె పాడిన పాటలు సంగీత ప్రియులను మెస్మరైజ్‌ చేస్తాయి. 1971లో హరే రామ హరే కృష్ణ సినిమాతో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ బ్రేక్‌ వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరగాల్సిన పనిరాలేదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఆమె పాడిన.. ‘హరి ఓం హరి’, ‘రంబా హో’, ‘డిస్కో డాన్సర్’, ‘దోస్టన్ సే ప్యార్ కియా’, ‘వన్ టూ చా చా చా’ వంటి ఎన్నో పాటలు దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్‌. ఉషా ఉతుప్ తన కెరీర్‌లో బెంగాలీ, హిందీ, పంజాబీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగుతో సహా మొత్తం 16 భాషలలో పాటలు పాడారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.