AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay – Trisha: ఇది అనధికార ప్రకటనా..? పెళ్లి వేడుకకు జంటగా వచ్చిన హీరో, హీరోయిన్

తమిళ నటుడు విజయ్, నటి త్రిష మరోసారి కలిసి పబ్లిక్‌లో కనిపించడం చర్చకు దారి తీసింది. ఓ వివాహ వేడుకకు ఒకే కారులో వచ్చి.. కలిసి నడుచుకుంటూ వెళ్లిన వీరి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రజంట్ విజయ్ వ్యక్తిగత జీవితం, రాజకీయ విమర్శల మధ్య ఈ అప్పిరియన్స్ మరింత ఆసక్తి కలిగిస్తుంది.

Vijay - Trisha: ఇది అనధికార ప్రకటనా..? పెళ్లి వేడుకకు జంటగా వచ్చిన హీరో, హీరోయిన్
Vijay Trisha
Ram Naramaneni
|

Updated on: Mar 05, 2026 | 9:57 PM

Share

తమిళ సినీ నటుడు విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్ మళ్లీ కలిసి కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకకు ఇద్దరూ కలిసి హాజరయ్యారు. ఒకే కారులో కార్యక్రమ స్థలానికి చేరుకున్న వీరిద్దరూ లోపలికి కూడా కలిసి నడుచుకుంటూ వెళ్లడం అక్కడున్న వారి దృష్టిని ఆకర్షించింది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన వీరిద్దరూ పర్‌ఫెక్ట్ జంటలా ఉన్నారంటూ అక్కడి దృశ్యాలు నెట్టింట వేగంగా వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే వీరిద్దరి స్నేహం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. గతంలో కూడా పలు సందర్భాల్లో కలిసి కనిపించినప్పటికీ, తాజాగా మళ్లీ ఒకే కార్యక్రమానికి కలిసి రావడం ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా విజయ్ వెంటే త్రిష నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో వీరి వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.

ప్రజంట్ విజయ్ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తోంది. ఒక హీరోయిన్‌తో విజయ్‌కు సన్నిహిత సంబంధం ఉందంటూ ఆయన భార్య సంగీత విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్రిషతో కలిసి విజయ్ పబ్లిక్‌గా కనిపించడం మరింత చర్చకు దారి తీసింది. ఇంకోవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‌పై ప్రత్యర్థులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. త్రిష పేరు ప్రస్తావిస్తూ రాజకీయంగా దాడులు చేస్తున్నా, విజయ్ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

రాజకీయ విమర్శలు, వ్యక్తిగత జీవితం చుట్టూ తిరుగుతున్న వార్తలు, భార్య విడాకుల పిటిషన్‌ వంటి అంశాల మధ్య కూడా విజయ్ త్రిషతో కలిసి కార్యక్రమాల్లో కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో విజయ్ నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన మౌనం వెనుక సందేశమేంటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా ఓపెన్ సీక్రెట్‌లాగానే మిగిలింది.

Follow Us