AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. పడిపోయిన కూరగాయల ధరలు.. ఇప్పుడు ఎంత ఉన్నాయంటే..?

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు గుడ్ న్యూస్. కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. రోజూ ఇంట్లోని ఉపయోగించే వెజిటేబుల్స్ ధరలు పెరిగితే సామాన్యులపై భార పడుతూ ఉంటుంది. రోజువారీ కూలీ చేసుకుని జీవనం కొనసాగించేవారికి కష్టంగా ఉంటుంది. కానీ టమాటా, వంకాయ లాంటి పలు కూరగాయల ధరలు తగ్గాయి.

Vegetable Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. పడిపోయిన కూరగాయల ధరలు.. ఇప్పుడు ఎంత ఉన్నాయంటే..?
Vegitable Prices
Venkatrao Lella
|

Updated on: Mar 05, 2026 | 1:43 PM

Share

సామాన్యులకు ధరల భారం తగ్గింది. రోజువారీ ఇంట్లో ఉపయోగించే కూరగాయల ధరలు తగ్గాయి. వంటింట్లో ప్రతీ కూరలో ఉపయోగించే టమాటా ధరలు పడిపోగా.. వంకాయ ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇక బీరకాయ, పచ్చిమిర్చి ధరలు కాస్త పెరిగాయి. టమాటా ధరలు గతంలో కిలో రూ.30 వరకు పలకగా.. ఇప్పుడు రూ.10కే రైతు బజార్లలో లభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

హైదరాబాద్‌లో ధరలు

హైదరాబాద్‌లోని కూకట్ పల్లి రైతు మార్కెట్లో కిలో టామాటా రూ.10, వంకాయ రూ.18, బెండకాయ రూ.28, పచ్చిమిర్చి రూ.50, బజ్జి మిర్చి రూ.33, కాకరకాయ రూ.31, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.13, బీన్స్ రూ.35, క్యారెట్ రూ.20, గోబిపువ్వు రూ.25, దొండకాయ రూ.35, చిక్కుడుకాయ రూ.35, గోరుచిక్కుడు రూ.30, బీట్ రూట్ రూ.18, క్యాప్చికం రూ.40కే దొరుకుతున్నాయి. ఇక బంగాళదుంప రూ.18, కీర రూ.20, దోసకాయ రూ.16, సోరకాయ రూ.15, పొట్లకాయ రూ.20, ఉల్లిగడ్డ రూ.20, చామగడ్డ రూ.25, చిలకడదుంప రూ.28కి విక్రయిస్తున్నారు. ఇక ఎండుమిర్చి కేజీ రూ.240, అల్లం రూ.100, వెల్లుల్లి రూ.140, చింతపండు రూ.180, పండుమిర్చి రూ.80, పల్లికాయ రూ.60కి లభిస్తున్నాయి.

గుంటూరులో ఇలా..

గుంటూరులోని ఎన్టీఆర్ రైతు బజార్‌లో కిలో టమాటా రూ. 10, వంగ రూ.17, బెండకాయ రూ.17, పచ్చిమిర్చి రూ.34, కాకరకాయ రూ.35, క్యారెట్ రూ.24, క్యాబేజీ రూ.18, బీరకాయ రూ.36, దొండకాయ రూ.27, బంగాళదుంప రూ.19, ఉల్లిగడ్డ రూ.20, గోరుచిక్కుడు రూ.22, దోసకాయ రూ.24, బీట్ రూట్ రూ.22, కీరదోస రూ.29, క్యాప్సికం రూ.50, చామ రూ.24, పొట్లకాయ రూ.25, సొరకాయ రూ.10కి విక్రయిస్తున్నారు.

విజయవాడలో..

ఇక విజయవాడలోని రైతు బజార్లలో కిలో టమాట రూ.10, వంగ రూ.14, బెండకాయ రూ.19, ఉల్లిపాయలు రూ.22, బంగాళదుంప రూ.23, దోస రూ.20, సొరకాయ రూ.7, చిక్కుళ్లు రూ.26, కీరదోస రూ.32, బీన్స్ రూ.50, బీట్ రూట్ రూ.22, కంద రూ.40, క్యాప్సికం రూ.56, చిలకడదుంప రూ.26, అలసందలు రూ.22, కాకరకాయ రూ.24, క్యాబేజీ రూ.16, క్యారెట్ రూ.26, దొండకాయ రూ.23, గోరుచిక్కుడు రూ.20 పలుకుతున్నాయి.

Follow Us
NEET UG 2026 కౌన్సెలింగ్‌.. సీట్ల కేటాయింపు ఫలితాలు వాయిదా..!
NEET UG 2026 కౌన్సెలింగ్‌.. సీట్ల కేటాయింపు ఫలితాలు వాయిదా..!
సూపర్‌‌ కార్ల రేసులోకి డచ్ సంస్థ రీ ఎంట్రీ.. పూర్తి వివరాలు
సూపర్‌‌ కార్ల రేసులోకి డచ్ సంస్థ రీ ఎంట్రీ.. పూర్తి వివరాలు
ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.
ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. కొత్తగా వారికి కూడా..
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. కొత్తగా వారికి కూడా..
టాటా ఎస్‌యూవీల్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏది
టాటా ఎస్‌యూవీల్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏది
గిరినాగుతో అట్లుంటాది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. 
గిరినాగుతో అట్లుంటాది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. 
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర