Speaker: లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా.. మరికాసేపట్లో ఎన్డీయే నేతలతో కలిసి నామినేషన్!
లోక్‌సభ మాజీ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈమేరకు ఉదయం 11:30 లోక్‌సభ సెక్రటేరియట్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. జూలై 3 వరకు జరిగే ఈ సెషన్‌లో రెండో రోజు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల తొలి రోజే 262 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ సహా 270 మంది ఎంపీలు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక సోమవారం రోజునే ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు పేరు ఖరారు కానుంది.
లోక్‌సభ మాజీ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈమేరకు ఉదయం 11:30 లోక్‌సభ సెక్రటేరియట్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఓం బిర్లా పార్లమెంట్ పీఎంవోలో జరుగుతున్న సమావేశం నుంచి బయటకు వచ్చారు. లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా పేరును ఎన్డీయే కూటమి ఖరారు చేసింది. కాసేపటి తర్వాత పార్లమెంటు హౌస్‌లోని ప్రధాని మోదీతో అమిత్ షా, జేపీ నడ్డా, ఓం బిర్లా సమావేశమయ్యారు. ఎన్డీయే నేతలతో కలిసి స్పీకర్ పదవి కోసం ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు.
NDA leaders signed a motion paper in favour of Om Birla for the Speaker of the 18th Lok Sabha. pic.twitter.com/U3X3PlYvBp
— ANI (@ANI) June 25, 2024
మరోవైపు విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ ఇవ్వవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి నామినేషన్ కోసం నేతలంతా తరలివచ్చారు. నేతలంతా కలిసి నామినేషన్ పత్రాలు, ప్రతిపాదనలు దాఖలు చేయనున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్లపై ఏకాభిప్రాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రముఖ ప్రతిపక్ష నేతలతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలతో ఆయన మాట్లాడారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..