Watch: నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం చూసి వావ్ అనాల్సిందే..!
ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు కూడా అద్భుతమైన దృశ్యంపై వ్యాఖ్యానించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో వేగంగా వైరల్‌గా మారింది. ఇది ఇప్పటివరకు 42 లక్షలకు పైగా వీక్షించారు. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోవడం, ప్రశంసించడం లాంటి రియాక్షన్స్ ఇచ్చారు.
అస్సాంలోని ఒక ఫోటోగ్రాఫర్ ఏనుగుల వీడియోను చిత్రీకరించారు. మీరు ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.! ఎందుకంటే, అస్సాంలోని ప్రధాన నదీ నౌకాశ్రయాలలో ఒకటైన నిమతి ఘాట్ వద్ద చిత్రీకరించిన ఈ డ్రోన్ ఫుటేజీలో ఏనుగుల గుంపు బ్రహ్మపుత్ర నది దాటడం కనిపిస్తుంది. ఏనుగులు ఎల్లప్పుడూ భూమిపై నివసించే గంభీరమైన జీవులుగా కనిపించినప్పటికీ, ఈ వీడియో వాటి ఈత నైపుణ్యాలను స్పష్టంగా చూపిస్తుంది. సచిన్ భరాలీ అనే ఫోటోగ్రాఫర్ బంధించిన ఈ వీడియోలో ఏనుగులు నీటిలో ఈదుతూ కనిపించాయి. వాటి శరీరం పైభాగం మాత్రమే నీటి నుండి బయటకు కనిపిస్తుంది.
సచిన్ భరాలీ తీసిన ఈ వీడియో ఏనుగుకు ఉండే ఈత టాలెంట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. భారీ శరీరంతో కనిపించే గజరాజులు మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయని ఈ వీడియో రుజువు చేస్తుంది.
View this post on Instagram
ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఏనుగులు నీటిలో ఈదలేవు అనే సాధారణ నమ్మకాన్ని ఇది విచ్ఛిన్నం చేస్తుంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు కూడా అద్భుతమైన దృశ్యంపై వ్యాఖ్యానించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో వేగంగా వైరల్‌గా మారింది. ఇది ఇప్పటివరకు 42 లక్షలకు పైగా వీక్షించారు. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోవడం, ప్రశంసించడం లాంటి రియాక్షన్స్ ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..