Viral Video: స్కూల్‌ విద్యార్థుల రీల్స్ పిచ్చితో డేంజరస్ స్టంట్స్.. అసలు ప్రాణాలంటే లెక్కే లేదు వీరికి

లైక్స్, కామెంట్స్, వ్యూస్ అనే వ్యసనంతో చాలా మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్స్ చూపిస్తున్నారు. ఇక్కడ వయస్సు తేడా కూడా లేదు. స్కూల్‌ విద్యార్థులు కూడా కంటెంట్ సృష్టికర్తలుగా మారుతున్నారు. అనేక సాహసోపేతమైన విన్యాసాలు చూపిస్తున్నారు. అలాంటి ఇద్దరు పాఠశాల విద్యార్థుల వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్టంట్ ఫలితం ఆ అమ్మాయి ప్రాణాల మీదకు తెచ్చింది.

Viral Video: స్కూల్‌ విద్యార్థుల రీల్స్ పిచ్చితో డేంజరస్ స్టంట్స్.. అసలు ప్రాణాలంటే లెక్కే లేదు వీరికి
School Girl Stunt
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 25, 2024 | 8:13 AM

నేడు చాలా మంది జీవితాలు సోషల్ మీడియాపైనే ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా కంటెంట్ సృష్టికర్తల జీవనోపాధికి ఇదే ఆధారంగా మారింది. అందుకే ఎప్పుడూ వ్యూస్‌, ఫాలోవర్స్‌ సంఖ్యను పెంచుకోవటానికి పరుగులు తీస్తుంటారు. దానికోసం వారు తమ జీవితాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడరు. సాహసోపేతమైన విన్యాసాలు చేస్తూ వ్యూస్ పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే ఈ విన్యాసాలు చేస్తూ ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ ఫాలోవర్స్‌ను పెంచుకోవడం కోసమే ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్టంట్‌కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అక్కడ ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్ స్టంట్స్ చూపిస్తున్నారు. స్టంట్ చివరిలో ఒక ప్రాణాంతకమైన సంఘటన ఉంది. అందుకే ఇలాంటి వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ వీడియోలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు బాలికలు హైవేపై రోడ్డు మధ్యలో నిలబడి ఉన్నారు. వారి వెనకాలే ఒక తెల్లటి కారు ఆగి వుంది. దానికి వాలి మరో ఇద్దరు పాఠశాల విద్యార్థులు చూస్తూ నిలబడి ఉన్నారు. మరోవైపు హైవేపై కార్లు అతి వేగంతో వెళ్తున్నాయి. అంతలోనే యూనిఫాంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మధ్యలో నిలబడి ఎవరూ ఊహించని విన్యాసాలు చేయడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఆ వీడియోలో ఒక అమ్మాయి మరో అమ్మాయి చేతులు పట్టుకుని తొడలపై కాళ్లు పెట్టి భుజాలపైకి ఎక్కటం స్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత అక్కడి నుంచి వేగంగా గాల్లోకి పల్టీ కొట్టింది..కిందపడే క్రమంలో తిరిగి తన సపోర్ట్‌ అయిన అమ్మాయి చేతులు పట్టుకుని నిటారుగా నిలబడాల్సి ఉండగా, తన పాదాల మీద బ్యాలెన్స్ తప్పింది. దీంతో అమాంతంగా నేలమీద పడిపోయింది. తన మొహంలో ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే దెబ్బ బాగా గట్టిగానే తగిలినట్టుగా అర్థమవుతుంది. తను సొంతంగా లేచి నిలబడలేకపోతుంది. పక్కనే ఉన్న తన స్నేహితురాలు తనను పైకి లేపి ఓదార్చుతోంది.

View this post on Instagram

A post shared by Shalu Kirar (@shalugymnast)

స్కూల్ విద్యార్థుల ఇలాంటి ఫీట్‌ని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వారి చర్యలు చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఫిబ్రవరి 17న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేయబడింది. కాగా, వీడియోకు ఇప్పటివరకు 17 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ విద్యార్థులు చేసిన పనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్ చేస్తున్నప్పుడు నడుము విరిగిపోతుంది జాగ్రత్త..! అంటూ హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..