Green Chilli Benefits: పచ్చిమిర్చి తింటే అందంగా తయారవుతామా..? అసలు విషయం ఇదే..!

మన శరీరానికి కావాల్సిన విటమిన్లు పచ్చి మిర్చిల్లో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థను పెంచే విటమిన్ సీ, చర్మ సంరక్షణకు తోడ్పడి, కంటి చూపును మెరుగు పరిచే విటమిన్ ఏ ఇందులో ఉంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి అలాగే కంటి చూపును పెంచడానికి సహాయపడుతుంది. పచ్చి మిరపకాయల్లో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయని పరిశోధనలో తేలింది.

Jyothi Gadda

|

Updated on: Jun 24, 2024 | 12:53 PM

1 / 5
పచ్చి మిర్చిలోని పోషకాలు చర్మానికి మంచి మెరుపును అందిస్తాయి. మంచి శరీర ఆకృతిని నిర్వహించడానికి సహాయపడుతుంది. పచ్చిమిర్చి మన శరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. జలుబు-దగ్గు సమస్యలకు పచ్చిమిర్చి దివ్యౌషధం.

2 / 5
పచ్చి మిర్చిల్లో కాప్సైసిన్ అనే పదార్థం ఉంటుంది. వీటిల్లో కారం మంట ఉండడానికి ఇదే కారణం. అయితే.. ఇది మన జీవక్రియను తాత్కాలికంగా బూస్ట్ చేస్తుంది. పైగా ఎక్కువ క్యాలరీలు కరిగేందుకు సాయపడుతుంది. బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతుంది. మిరపకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోని అంతర్గత భాగాలను శుభ్రపరచడం ద్వారా క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. అలాగే శరీరంలో ఉండే  ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి.

3 / 5
పచ్చిమిర్చి.. బీటా కెరోటిన్, కాప్సైసిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్​ను న్యూట్రలైజ్ చేయడంలో సాయపడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడే ప్రమాదం నుంచి రక్షిస్తాయి. అలాగే మిర్చిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి మొటిమలు, మచ్చలు నివారించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

4 / 5
పచ్చి మిర్చిలు పలు జీర్ణ రసాలను ప్రేరేపిస్తాయి. ఇవి జీర్ణ క్రియ సాఫీగా సాగేందుకు తోడ్పడతాయి. అజీర్తి, కడుపు ఉబ్బరంతో బాధపడేవారు మిర్చి తింటే ఆ బాధ నుంచి ఉపశమనం పొందొచ్చు. అంతేకాదు.. పచ్చిమిర్చి.. నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కండరాల నొప్పి, అర్థరైటిస్ చికిత్సల్లో ఉపయోగించే కొన్ని క్రీముల్లో దీన్ని వినియోగిస్తారు.

5 / 5
Follow us