Horse Gram Benefits: ఉలవలు వాటి ఆరోగ్య విలువలు తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు..

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమయంలో ఉలవల చారు చేసుకొని తినడం వల్ల స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఉల‌వ‌ల‌ను, బియ్యాన్ని క‌లిపి జావ‌గా త‌యారు చేసుకొని తాగడం వల్ల లైంగిక సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Horse Gram Benefits: ఉలవలు వాటి ఆరోగ్య విలువలు తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు..
Horse Gram
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2024 | 12:23 PM

నవధాన్యాలలో ఒకటైన ఉలవలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఉలవలు తినటం వల్ల శరీరానికి కావాలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉలవలు తీసుకోవడం వల్ల మెరుగైన ఆరోగ్యని పొందుతారని అంటున్నారు. ముఖ్యంగా ఉలవలతో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఐరన్‌ అధికంగా దొరుకుతాయి. ఇది చిన్న పిల్లలు తినడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు.

వర్షాకాలం, శీతాకాలంలో కఫ దోష సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఉలవలు తమ ఆహారంలో భాగంగా చేర్చుకోవటం వల్ల సమస్య దూరం చేసుకోవచ్చు. ఆకలిలేమి సమస్యతో బాధపడుతున్నవారు ఉలవలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఉల‌వ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలో వచ్చే రాళ్లు సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ ఉలవలు తీసుకోవడం వల్ల అధిక ఫైబర్ కంటెంట్‌ లభిస్తుంది. దీని వల్ల మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉల‌వ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమయంలో ఉలవల చారు చేసుకొని తినడం వల్ల స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

ఉల‌వ‌ల‌ను, బియ్యాన్ని క‌లిపి జావ‌గా త‌యారు చేసుకొని తాగడం వల్ల లైంగిక సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీనితో పాటు పాలను కూడా రాత్రి పూట తీసుకోవాలి. న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్యతో బాధపడుతున్నవారు ఉలవలు తీసుకోవడం వల్ల సమస్య త‌గ్గుతుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అలాంటి సమయంలో చల్లని మజ్జిగ లేద పాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌టప‌డ‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కీళ్ల సమస్యతో బాధపడుతున్నవారు ఉల‌వ‌ల‌ను వేడి చూసి కాటన్ క్లాత్ మూట క‌ట్టాలి. దీనిని నొప్పులు , వాపులు ఉన్న చోట కాప‌డం పెట్టుకోవ‌డం మేలు జరుగుతుంది. ఉలవలు తీసుకోవడం వల్ల జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.