ఒక వారం పాటు టీ తాగడం మానేస్తే ఏమవుతుందో తెలుసా.? శరీరంలో జరిగే మార్పులు ఇవే..!

టీ ఎందుకు తాగాలి అని అడిగితే టీ ప్రియులు వంద కారణాలు చెబుతారు. ఎంత టెన్షన్‌లో ఉన్నా ఒక్క టీ తాగితే వంద గంటలు పని చేసే శక్తి వస్తుందని అంటున్నారు. కానీ, టీ తాగడం మానేస్తే ఏమవుతుందో తెలుసా? ఒక్క వారం టీ తాగడం మానేస్తే మీ శరీరం, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

ఒక వారం పాటు టీ తాగడం మానేస్తే ఏమవుతుందో తెలుసా.? శరీరంలో జరిగే మార్పులు ఇవే..!
Tea
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2024 | 9:23 AM

కొందరికి ఉదయం, సాయంత్రం టీ కావాలి. కొంతమంది టీ తాగడానికి కారణం వెతుకుతుంటారు. కొందరికి టీ లేకుండా ఏ పని ముందుకు సాగదు. రోజుకు ఎన్నిసార్లు టీ తాగుతున్నారన్నది ముఖ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాలలో టీ కూడా ఒకటి. పాలలో కొద్దిగా పంచదార, చిటికెడు టీపొడి వేసి బాగా మరిగిస్తే రుచికరమైన టీ తయారవుతుంది. టీ ఎందుకు తాగాలి అని అడిగితే టీ ప్రియులు వంద కారణాలు చెబుతారు. కానీ, టీ తాగడం మానేస్తే ఏమవుతుందో తెలుసా? ఒక్క వారం టీ తాగడం మానేస్తే మీ శరీరం, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

ఎంత టెన్షన్‌లో ఉన్నా ఒక్క టీ తాగితే వంద గంటలు పని చేసే శక్తి వస్తుందని అంటున్నారు. కానీ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై కొంత ప్రభావం ఉంటుంది. కాబట్టి టీ వినియోగం మితంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇప్పుడు చక్కెర లేకుండా టీ తాగడం ద్వారా తమ టీ కోరికలను తీర్చుకుంటున్నారు. కొంతమంది ఆరోగ్య కారణాల రీత్యా బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ తాగుతుంటారు. పాలలో పంచదార, టీ పొడి తాగకపోతే ఏమవుతుందో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.

వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే అజీర్ణం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. పేగు సంబంధిత వ్యాధులు ఉంటే టీ తాగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. టీ వినియోగానికి దూరంగా ఉంటే గుండెల్లో మంట, తల తిరగడం, గుండె వేగంలో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు తగ్గుతాయి. చేతులు వణికిపోతుంటే టీ తాగడం వల్ల ఈ సమస్య క్రమంగా తగ్గుతుంది. ఒక వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే మీ అధిక రక్తపోటు తిరిగి నార్మల్ పొజీషన్ లోకి వస్తుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య మొత్తమే పోతుంది.

ఇవి కూడా చదవండి

టీ అలవాటు తగ్గించుకున్న తరువాత బాగా నిద్రపోవచ్చు. విరేచనాలు, వాంతులు లేదా చెడు అపానవాయువు/ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. వీటన్నింటితో పాటు బరువు తగ్గడం మొదలవుతుంది. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ టీ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు వివరిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఒక్కప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒక్కప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు