రోజూ ఉదయాన్నే ఒక చెంచా కొబ్బరినూనె తాగితే నమ్మలేని లాభాలు..ఈ జబ్బుల నుంచి శాశ్వత ఉపశమనం..!

ఇది శరీరానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దీన్ని ఎలాంటి చర్మం వారైనా వాడొచ్చు. ముడతలు, చర్మం పగుళ్లను కొబ్బరి నూనె నియంత్రిస్తుంది. జట్టు బాగా పెరిగేందుకు అవసరమైన పోషకాలన్నీ కొబ్బరి నూనెలో ఉంటాయి. కొబ్బరి నూనె రసాయనాలు లేని సహజ హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది. రోజూ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె తీసుకుంటే ఒక నెలలోనే శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయంటున్నారు.

రోజూ ఉదయాన్నే ఒక చెంచా కొబ్బరినూనె తాగితే నమ్మలేని లాభాలు..ఈ జబ్బుల నుంచి శాశ్వత ఉపశమనం..!
చర్మం అయినా, జుట్టు అయినా - సౌందర్య సంరక్షణలో కొబ్బరి నూనెకు ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటికీ అమ్మమ్మలు, నానమ్మలు చర్మానికి కొబ్బరి నూనెను వినియోగిస్తుంటారు. కొబ్బరి నూనెలో వివిధ రకాల విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది చర్మం, జుట్టు రెండింటికీ మేలు చేస్తాయి. దెబ్బతిన్న జుట్టు, చర్మాలకు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల చికిత్స అందిస్తుంది.
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2024 | 7:45 AM

సాధారణంగా మనం తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనెను ఉపయోగిస్తాము. కానీ కేరళ రాష్ట్రం, కర్ణాటక తీర ప్రాంతంలో కొబ్బరి నూనె వంట కోసం ఉపయోగిస్తారు. ఇటీవల, కొబ్బరి నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా విపరీతమైన ప్రజాదరణ పొందింది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె తీసుకుంటే ఒక నెలలోనే శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయంటున్నారు.

జీవక్రియ మెరుగుదల: కొబ్బరి నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మన శరీరానికి సులభంగా లభించే శక్తి వనరులను అందిస్తుంది. మన జీవక్రియను మరింత వేగవంతం చేస్తుంది. కొబ్బరి నూనె రోగ నిరోధక శక్తిని పెంపొందించి జ్వరాలు, వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.

జీర్ణక్రియ: కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు అవాంఛిత పేగు బ్యాక్టీరియాను చంపుతాయి. ఉబ్బరం, మలబద్ధకం, ఇతర జీర్ణ రుగ్మతల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అజీర్ణం కలిగించే వివిధ బ్యాక్టీరియాలు, ఫంగస్‌లతో కొబ్బరి నూనె పోరాడుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్ E, Kతోపాటు ఐరన్ తదితర మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మెదడు పనితీరు: ఉదయాన్నే కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు, మానసిక స్పష్టత మెరుగుపడుతుంది. మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మీ మెదడును పదునుగా, ఏకాగ్రతగా ఉంచుతాయి. రక్తపోటు, మధుమేహం రోగులకు కూడా కొబ్బరి నూనె చాలా మేలు చేస్తుంది.

గుండె ఆరోగ్యం: ఆరోగ్యకరమైన గుండె కోసం మీ ఆహారంలో కొబ్బరి నూనెను చేర్చుకోండి. ఈ మంచి కొవ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. కొబ్బరి నూనె వల్ల శరీరంలో గుండెకు మేలు చేసే మంచి కొవ్వు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తెలిసింది.

బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది: సహజ పద్ధతుల్లో బరువు తగ్గాలనుకొనేవారు కొబ్బరి నూనె వాడితే ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె జీవక్రియను పెంపొందించడంతో పాటు థైరాయిడ్, ఎండోక్రైన్ గ్రంధులు సక్రమంగా పనిచేయడానికి సహకరిస్తుంది.

సౌందర్య అవసరాల్లో: కొబ్బరి నూనెను ఎన్నో శతాబ్దాల నుంచి సౌందర్య అవసరాలకు వాడుతున్నారు. ఇది శరీరానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దీన్ని ఎలాంటి చర్మం వారైనా వాడొచ్చు. ముడతలు, చర్మం పగుళ్లను కొబ్బరి నూనె నియంత్రిస్తుంది. జట్టు బాగా పెరిగేందుకు అవసరమైన పోషకాలన్నీ కొబ్బరి నూనెలో ఉంటాయి. కొబ్బరి నూనె రసాయనాలు లేని సహజ హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.