Watch: లేడీ హ్యాండ్‌ బ్యాగ్‌లో దాచిన చాక్లెట్స్‌ కోసం ఒరాంగుటాన్‌ మారాం.. ఫన్నీ వీడియో చూస్తే పొట్టచెక్కలే..!

ఒరంగుటాన్‌కి సంబంధించిన ఈ మధురమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పటికే దాదాపు 34 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.  లైక్‌లు దాదాపు 40 వేలకు మించిపోయాయి.. కామెంట్‌ బాక్స్‌ పూర్తిగా ఫన్నీ వ్యాఖ్యలతో నిండి పోయింది. చాలా మంది ఈ ఒరంగుటాన్‌ను మనుషుల కంటే తెలివైనదిగా ప్రశంసిస్తున్నారు.

Watch: లేడీ హ్యాండ్‌ బ్యాగ్‌లో దాచిన చాక్లెట్స్‌ కోసం ఒరాంగుటాన్‌ మారాం.. ఫన్నీ వీడియో చూస్తే పొట్టచెక్కలే..!
Orangutan
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2024 | 9:57 AM

ఈరోజుల్లో సోషల్ మీడియా పేజీలు ఓపెన్ చేస్తే రకరకాల వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ కంటెంట్‌లో కొన్ని మనకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. మన సోషల్ మీడియా అటువంటి కంటెంట్‌తో నిండి ఉంది. కొన్ని వీడియోలు మన కళ్లలో నీళ్లు తెప్పించేవిగా కనిపిస్తాయి..తాజాగా అలాంటి ఫన్నీ వీడియో ఒకటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఒక జూలో జరిగిన సంఘటన. ఓ మహిళ, ఒరంగుటాన్ మధ్య ఫన్నీ సంఘటన జరిగింది. మహిళ హ్యాండ్‌బ్యాగ్‌ లోపల మిఠాయి ఉందని ఒరంగుటాన్ ఎలాగోలా గ్రహించింది. దాంతో ఆ మహిళ దగ్గరకు వచ్చి ఆమె బ్యాగ్‌లోని మిఠాయి కావాలంటూ మారం చేస్తున్న దృశ్యం అందరినీ నవ్విస్తుంది. ఇక ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైరల్ వీడియో జూకి సంబంధించినది. వీడియోలో పర్యాటకుల వాహనం కిటీకి అద్దం అవతలి వైపున ఒరంగుటాన్ కనిపిస్తుంది. లోపలి వైపు ఒక మహిళ ఉంది. ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌కు కొన్ని డెకరేటివ్‌ ఐటమ్స్‌ ఉన్నాయి. ఆ వైపుకు ఒరంగుటాన్ తన వేలు చూపుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు ఆ మహిళ తన బ్యాగ్‌లోని వివిధ వస్తువులను తీసి ఒరంగుటాన్‌కు చూపిస్తుంది. కానీ, అవేవీ ఆ ఒరాంగూటాన్‌కు నచ్చలేదు. దాంతో ఏది చూపించినా నచ్చలేదని, అది కాదనే విధంగా తన సైగలతో చెబుతుంది. ఒకానొక సమయంలో ఒరంగుటాన్ ఆమె లేడీ హ్యాండ్‌బ్యాగ్ జీప్‌ ఓపెన్‌ చేయమని అడగడం కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో ఒరంగుటాన్‌ ఒక మనిషిలాగే చేస్తున్న యాక్షన్స్‌ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

చివరకు ఆ మహిల తన బ్యాగ్ లోపల ఉన్న గమ్మీ స్నాక్స్ ప్యాకెట్‌ని ఒరంగుటాన్‌కు చూపించగా, దానికి కావాల్సిన మిఠాయి ఇదేనని వేలితో చూపించింది.. అయితే మహిళ సంచిలో ఉన్న మిఠాయి ఒరాంగుటాన్‌కు ఎలా తెలిసింది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.ఇంతలో, వీడియోలో ఒరంగుటాన్ గమ్ ఎక్కడ ఇవ్వాలో స్పష్టంగా చూపిస్తుంది. ఈ తీపి మిఠాయి కోసం ఒరంగుటాన్ తీవ్రంగా ప్రయత్నించడం చూసి, చాలా మంది దానికి స్వీట్ పిచ్చి బాగానే ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఒరంగుటాన్‌కి సంబంధించిన ఈ మధురమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పటికే దాదాపు 34 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.  లైక్‌లు దాదాపు 40 వేలకు మించిపోయాయి.. కామెంట్‌ బాక్స్‌ పూర్తిగా ఫన్నీ వ్యాఖ్యలతో నిండి పోయింది. చాలా మంది ఈ ఒరంగుటాన్‌ను మనుషుల కంటే తెలివైనదిగా ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు