Vijay Thalapathy: 420 కోట్ల ఆస్తులు.. బ్రాండ్‌ న్యూ కార్లు.! దిమ్మతిరిగేలా చేస్తున్న విజయ్‌ ఆస్తుల లెక్కలు.

Vijay Thalapathy: 420 కోట్ల ఆస్తులు.. బ్రాండ్‌ న్యూ కార్లు.! దిమ్మతిరిగేలా చేస్తున్న విజయ్‌ ఆస్తుల లెక్కలు.

Anil kumar poka

|

Updated on: Jun 24, 2024 | 10:10 AM

విజయ్ దళపతి..! కోలీవుడ్లో తిరుగులేని స్టార్ డమ్‌ అండ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తొందర్లో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే పార్టీ ప్రకటించేసి.. తన కమిట్ అయిన ఈసినిమాలను చకాచకా ఫినిష్ చేస్తున్నారు ఈ హీరో. అయితే న్నిన్న మొన్నటి వరకు 49వ పడిలో ఉన్నీ హీరో.. నేటితో అంటే జూన్ 22తో 50 పడిలోకి అడుగుపెడుతున్నాడు.

విజయ్ దళపతి..! కోలీవుడ్లో తిరుగులేని స్టార్ డమ్‌ అండ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తొందర్లో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే పార్టీ ప్రకటించేసి.. తన కమిట్ అయిన ఈసినిమాలను చకాచకా ఫినిష్ చేస్తున్నారు ఈ హీరో. అయితే న్నిన్న మొన్నటి వరకు 49వ పడిలో ఉన్నీ హీరో.. నేటితో అంటే జూన్ 22తో 50 పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ కమ్రంలోనే ఈయన ఆస్తి విలువ.. ఈ స్టార్ హీరో దగ్గర ఉన్న బ్రాండ్ న్యూ లగ్జరీ కార్లు గురించి సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

గతంలో ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు దళపతి విజయ్ . అయితే 2019 నుండి ఆయన రేంజ్ పెరిగింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు 200 కోట్లు అందుకుంటున్నాడని టాక్. చివరి సినిమాకి ఏకంగా 250 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడని కోలీవుడ్ మీడియా సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. ఇక దళపతి విజయ్ కు సుమారు 420 కోట్ల ఆస్తులున్నాయని తెలుస్తోంది. విజయ్ కేవలం సినిమాల ద్వారానే కాకుండా పలు కంపెనీల ప్రకటనల్లో నటిస్తూ సంపాదిస్తున్నాడు. కేవలం ప్రకటనల ద్వారానే ఏటా 10 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా. కోకాకోలా, చెన్నై సూపర్ కింగ్స్ మొదలైన వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు విజయ్. అంతేకాదు విజయ్‌కి కార్లంటే విపరీతమైన క్రేజ్. ఆయన గ్యారేజ్ లో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. విజయ్ ఇంట్లో ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు ఉంది. అది కాకుండా 1.30 కోట్ల విలువైన ఆడి ఏ8, 75 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ, 90 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6, 35 లక్షల విలువైన మినీ కూపర్ వంటి లగ్జరీ కార్లు విజయ్ గ్యారేజ్ లో ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.