Jabardasth: రైలు, ఫ్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని జబర్దస్త్ ఆర్టిస్ట్ మృతి.. వీడియో.

Jabardasth: రైలు, ఫ్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని జబర్దస్త్ ఆర్టిస్ట్ మృతి.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Jun 24, 2024 | 9:09 AM

చుంచుపల్లి మండలం నందాతండాకు చెందిన మేదర మహ్మద్దీన్‌ జబర్దస్త్‌ షోలో నటటిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 50 ఎపిసోడ్‌లలో కనిపించాడు. అయితే తనకు హైదరాబాద్‌లో షూటింగ్‌ ఉండటంతో.. ట్రైన్ ఎక్కేందుకు భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈక్రమంలోనే కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌లో ముందుకు కదలడాన్ని చూసి.. ఆ ట్రైన్‌ను ఎక్కేందుకు ప్రయత్నించాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి.. ట్రైన్, పట్టాల మధ్య ఇరుక్కుని జబర్దస్త్‌ షో నటుడు మృతి చెందాడు. ఇప్పుడీ ఘటన అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. చుంచుపల్లి మండలం నందాతండాకు చెందిన మేదర మహ్మద్దీన్‌ జబర్దస్త్‌ షోలో నటటిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 50 ఎపిసోడ్‌లలో కనిపించాడు. అయితే తనకు హైదరాబాద్‌లో షూటింగ్‌ ఉండటంతో.. ట్రైన్ ఎక్కేందుకు భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈక్రమంలోనే కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌లో ముందుకు కదలడాన్ని చూసి.. ఆ ట్రైన్‌ను ఎక్కేందుకు ప్రయత్నించాడు. అలా రైలు ఎక్కే ప్రయత్నంలో అతని కాలు జారడంతో.. ట్రైన్, ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కుపోయాడు.

గమనించిన తోటి.. ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్‌ ఆగేలా చేశారు. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది.. మహ్మద్దీన్‌ను అతి కష్టం మీద బయటకు తీసి అంబులెన్స్‌లో కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. టెస్టులు చేసిన డాక్టర్లు.. మహ్మద్దీన్ నడుము, పక్కటెముకలకు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రాథమిక చికిత్స చేసి.. మెరుగైన వైద్యం ఖమ్మం తరలించాలని సూచించారు. వెంటనే తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలో మహ్మద్దీన్ తుదిశ్వాస విడిచారు. డెడ్‌బాడీని సర్వజన ఆస్పత్రికి తరలించారు.. అక్కడ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ కంప్లైంట్‌తొ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.