Snake In Toilet: టాయిలెట్‌ కమోడ్‌లో దూరిన పాము.. వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి..!

సమాచారం అందుకున్న స్నేక్‌ క్యాచర్‌ రాజేష్ జాట్ నాగుపామును కమోడ్ నుండి బయటకు తీయడానికి జాగ్రత్తగా ప్రయత్నిస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. సన్నటి నీటి పైపుతో పాము నోట్లో నీళ్లు పోయడం ప్రారంభించాడు. మెల్లగా నాగుపాము పైపులోని నీటిని అనుసరించి బయటకు వచ్చింది. అనంతరం పామును పట్టుకున్నాడు. ఇలాంటి పాము పట్టే సీన్ చూసి నెటిజన్లు కూడా భయపడుతున్నారు.

Snake In Toilet: టాయిలెట్‌ కమోడ్‌లో దూరిన పాము.. వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి..!
Cobra Found Inside Toilet
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 25, 2024 | 7:29 AM

Snake In Toilet: పాములకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో తరచూగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోలో కొన్ని కొన్ని సార్లు పాములు ఇల్లు, బైకులు, కార్లలో దూరి ప్రజల్ని కంగారు పెట్టిస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇందులో ఒక పాము ఓ ఇంటి టాయిలెట్ కమోడ్‌ నుంచి భారీ నాగుపాము బయటకు వచ్చిన షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ ఘటన చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోని స్నేక్‌ క్యాచర్‌ రాజేష్ జాట్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

ఇండోర్‌లో టాయిలెట్ కమోడ్ నుంచి పాము బయటకు వచ్చిన దారుణ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న స్నేక్‌ క్యాచర్‌ రాజేష్ జాట్ నాగుపామును కమోడ్ నుండి బయటకు తీయడానికి జాగ్రత్తగా ప్రయత్నిస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. సన్నటి నీటి పైపుతో పాము నోట్లో నీళ్లు పోయడం ప్రారంభించాడు. మెల్లగా నాగుపాము పైపులోని నీటిని అనుసరించి బయటకు వచ్చింది. అనంతరం పామును పట్టుకున్నాడు. ఇలాంటి పాము పట్టే సీన్ చూసి నెటిజన్లు కూడా భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన తర్వాత కొందరు భయపడుదూ.. వామ్మో..ఇదో పీడకల అని అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కామెంట్ సెక్షన్ కామెంట్లతో నిండిపోయింది. కొందరు స్నేక్‌ క్యాచర్‌ని ప్రశంసిస్తూ నువ్వు నిజమైన ధైర్యవంతుడివి అని రాశారు. పామును పట్టుకోవడం నిజంగా సవాలుతో కూడుకున్నది. ప్రమాదకరమైన పని అంటూ మరికొందరు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..