Viral Video: ఇన్‌స్టా రీల్స్ మోజులో పిచ్చిపని.. కార్లను డ్రైవ్ చేస్తూ నేరుగ సముద్రంలోకి! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయేందుకు కొందరు ఆకతాయిలు ఎంతకైనా తెగిస్తున్నారు. చిల్లర వేషాలు వేస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలను పణంగా పెట్టిమరీ ప్రమాదకర స్టంట్స్‌తో రీల్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా అటువంటి ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఇన్‌స్టా రీల్స్ కోసం విన్యాసాలు చేస్తూ తమ వాహనాలను ఏకంగా సముద్రంలోకి పోనిచ్చారు. ఆ తర్వాత..
గుజరాత్, జూన్ 24: సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయేందుకు కొందరు ఆకతాయిలు ఎంతకైనా తెగిస్తున్నారు. చిల్లర వేషాలు వేస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలను పణంగా పెట్టిమరీ ప్రమాదకర స్టంట్స్‌తో రీల్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా అటువంటి ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఇన్‌స్టా రీల్స్ కోసం విన్యాసాలు చేస్తూ తమ వాహనాలను ఏకంగా సముద్రంలోకి పోనిచ్చారు. రీల్స్ సంగతి పక్కన పెడితే అలల ధాటికి ఉక్కిరిబిక్కిరైపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుజరాత్‌లోని కచ్‌లోని ముంద్రా టౌన్‌లోని భద్రేశ్వర్‌లో బీచ్‌లో ఎస్‌యూవీలతో విన్యాసాలు చేస్తూ రీల్ రికార్డ్ చేస్తూ ఇద్దరు కాలేజీ విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. కరణ్ సొరథియా (23) మరియు పరేష్ సోరథియా (23) అనే ఇద్దరు యువకులు సముద్రంలోకి తమ బ్లాక్, వైట్ రంగుల్లో ఉన్న ఎస్‌యూవీ కార్లను పోనిచ్చారు. అయితే సరిగ్గా అదేసమయంలో సముద్రం ఉద్రుతంగా ఉంది. అలలు పెద్ద స్థాయిలో ఎగసిపడుతుండటంతో రెండు వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. ఎరుపు రంగు కారు అధిక ఆటుపోట్లలో పాక్షికంగా మునిగిపోగా.. తెలుపు రంగులో ఉన్న కారు టైర్లు నీటిలో మునిగి ఉంటాయి. ఎటూ కదల్లేకమెదల్లేక రెండు కార్లు అక్కడే ఇరుక్కుపోయాయి. దీంతో వారు కార్లను ఒడ్డుకు చేర్చేందుక నానాతిప్పలు పడ్డారు. ఒకరు కారును ఎత్తేందుకు కూడా యత్నించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి స్థానికుల సాయంతో ట్రాక్టర్ ద్వారా ఎలాగోలా వారి వాహనాలు సముద్రం ఒడ్డకు చేర్చగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆకతాయిలు తమ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
For reel mania, two youths drove two Thar cars into deep waters at Mundra beach, Kutch.
High tide almost engulfed the vehicles, trapping them.
With villagers’ help, Thars were retrieved, but one Jeep’s engine failed.pic.twitter.com/C5Ft67d876
— Kumar Manish (@kumarmanish9) June 23, 2024
ఈ వీడియో వైరల్ కావడానికి 15 రోజుల ముందు చిత్రీకరించారు. అలా అది పోలీసుల కంటపడటంతో ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కచ్ పోలీసులు తెలిపారు. అనంతరం రీల్స్ కోసం ఉపయోగించిన రెండు ఎస్‌యూవీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.