AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ట్రాఫిక్‌ పోలీస్‌ను కారుతో సహా బరాబరా ఈడ్చుకెళ్లిన మందుబాబు.. వీడియో వైరల్‌

హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం మద్యం మద్యం మత్తులో ఉన్న ఓ మందుబాబు రోడ్డు మధ్యలో కారు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. రోడ్డు మధ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవడానికి తన కారును ఆపడం వల్ల ట్రాఫిక్‌ సమస్య తలెత్తింతి. వెంటనే అక్కడికి చేరుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌ వాహనం పత్రాలు చూపించాలని డ్రైవర్‌ను కోరాడు. పేపర్‌లను పరిశీలించేందుకు..

Watch Video: ట్రాఫిక్‌ పోలీస్‌ను కారుతో సహా బరాబరా ఈడ్చుకెళ్లిన మందుబాబు.. వీడియో వైరల్‌
Traffic Cop Dragged By Drunk Driver
Srilakshmi C
|

Updated on: Jun 23, 2024 | 12:37 PM

Share

చండీగఢ్‌, జూన్‌ 23: హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం మద్యం మద్యం మత్తులో ఉన్న ఓ మందుబాబు రోడ్డు మధ్యలో కారు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. రోడ్డు మధ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవడానికి తన కారును ఆపడం వల్ల ట్రాఫిక్‌ సమస్య తలెత్తింతి. వెంటనే అక్కడికి చేరుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌ వాహనం పత్రాలు చూపించాలని డ్రైవర్‌ను కోరాడు. పేపర్‌లను పరిశీలించేందుకు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ డ్రైవర్‌ డోర్‌ గుండా లోపలికి వంగగానే డ్రైవర్‌ అకస్మాత్తుగా యాక్సిలరేటర్‌ను నొక్కి కారును స్పీడుగా ముందుకు పోనిచ్చాడు. దీంతో కారుడోర్‌లో ఇరుక్కుపోయిన ట్రాఫిక్‌ పోలీస్‌ కారుతోపాటు ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు. గమనించిన ఇతర పోలీసులు కారును ఆఫి ట్రాఫిక్‌ పోలీసును రక్షించారు.

కారు డ్రైవర్‌ తప్పించుకునేందుకు యత్నించి కారును వేగంగా ముందుకు నడిపడం వల్ల అనుకోకుండా ట్రాఫిక్‌ పోలీస్‌ కూడా అతని కారుతో పాటు కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అనంతరం మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను కారు నుంచి బయటకు లాగి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిని కొందరు వ్యక్తులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

కాగా ఇదే ఏడాది మే 24 ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలో వాహనాన్ని ఆపడానికి యత్నించిన ట్రాఫిక్ పోలీసు అధికారి కారు బానెట్‌పై పడిపోవడంతో కొన్ని మీటర్లు కారు డ్రైవర్‌ ఈడ్చుకెళ్లాడు. కానిస్టేబుల్ కారు వస్తున్నట్లు గమనించి, అనుమానాస్పదంగా భావించి, వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. అయితే వాహనం ఆపకపోవడంతో అతడిని ఢీకొట్టింది. బానెట్ మీద పడి వైపర్ పట్టుకున్నాడు. ఆ తర్వాత మరో వాహనంలో ఓ అధికారి కారును వెంబడించి చివరకు కారును ఆపడంతో పోలీస్‌కు ప్రాణాపాయం తప్పింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డ్రైవర్‌కు జరిమానా విధించి, కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.