Tirupati: ఛీ.. యాక్! భోజనంలో బాగా వేయించిన విషపు జెర్రి.. తిరుపతిలో ఓ హోటల్ నిర్వాకం! వీడియో
హోటల్‌లో భోజనం చేసేందుకు వచ్చిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. హోటల్ సిబ్బంది వడ్డించిన భోజనంలో ఓ వింత ఆకారం కనిపించింది. నిశితంగా పరిశీలించగా బాగా రోస్ట్ అయిన విషపు కీటకంగా గుర్తించాడు. దీంతో ఇదేంటని ప్రశ్నించిన అతనిపై హోటల్ సిబ్బంది దాడికి దిగారు. ఒళ్లు మండిన సదరు యువకుడు ఫొటోలు వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం కాస్త చిరిగి చిరిగి గాలివానగా..
తిరుపతి, జూన్ 21: హోటల్‌లో భోజనం చేసేందుకు వచ్చిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. హోటల్ సిబ్బంది వడ్డించిన భోజనంలో ఓ వింత ఆకారం కనిపించింది. నిశితంగా పరిశీలించగా బాగా రోస్ట్ అయిన విషపు కీటకంగా గుర్తించాడు. దీంతో ఇదేంటని ప్రశ్నించిన అతనిపై హోటల్ సిబ్బంది దాడికి దిగారు. ఒళ్లు మండిన సదరు యువకుడు ఫొటోలు వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం కాస్త చిరిగి చిరిగి గాలివానగా మారింది. ఈ ఘటన తిరుపతిలో పీఎస్ 4 హోటల్‌లో గురువారం (జూన్ 20) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
పుత్తూరుకు చెందిన వాసు అనే యువకుడు, అతని స్నేహితులు ఓ ఆసుపత్రి పని విషయమై తిరుపతికి వచ్చారు. గురువారం వాసు, అతని స్నేహితులు తిరుమల బైపాస్ మార్గంలోని పీఎస్4 హోటల్‌కు భోజనం చేసేందుకు వెళ్లారు. సిబ్బంది వడ్డించిన భోజనంలో గుర్తించలేని విధంగా ఓ వింత ఆకారాన్ని వాసు గుర్తించాడు. పరిశీలించి చూడగా బాగా రోస్టైన జెర్రి అది. బొజనం ప్లేట్‌లో గుర్తించలేని విధంగా ఉన్న జెర్రిని చూసి వాసు అతని స్నేహితులు అవాక్కయ్యారు. ఇదేంటని ప్రశ్నించగా.. హోటల్ యాజమన్యం సరైన సమాధానం ఇవ్వకపోగా వాసు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సమాచారం అందుకున్న మీడియా అక్కడికి చేరుకోవడంతో హోటల్ సిబ్బంది ఆగ్రహించి వాసుపై దాడికి దిగారు.
హోటల్ సిబ్బంది దౌర్జన్యం చేయడంతో.. వాసు అతని స్నేహితుడు పుడ్ ఇన్ స్పెక్టర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారి అన్వేష్‌రెడ్డి అక్కడికి చేరుకుని హోటల్‌లోని కిచెన్‌ను పరిశీలించి షాక్‌కు గురయ్యారు. లోపల కుళ్లిన కూరగాయలు, బూజు పట్టిన వంట సామగ్రి చూసి నిబంధనలకు విరుద్ధంగా వంటశాలను ఆపరిశుభ్రత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన అధికారులు ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ప్రాథమిక నివేదిక అందజేశారు. అనతరం గురువారం రాత్రి హోటల్‌ను సీజ్ చేసి నోటీసులు అతికించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.