AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రాణం తీసిన ‘రీల్స్‌’ సరదా.. ఉరి వేసుకుంటున్నట్లు వీడియో తీయబోయాడు! కానీ అంతలోనే..

రీల్స్‌ మోజు యువకుడి ప్రాణాలు తీసింది. సరదాగా మెడకు ఉరిని వేసుకుని ఫొటోకు ఫోజులివ్వబోయాడు. కానీ అనుకోకుండా అది మెడకు బిగించుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రాత్రి సమయంలో కావడంతో ఎవరూ గమనించలేదు. దీంతో యువకుడు మృతి చెందాడు. తెల్లారి నిద్రలేచిన తల్లిదండ్రలు ఉరికొయ్యకు వేలాడుతూ కొడుకు కనిపించడంతో గుండెలవిసేలా రోధించారు. ఈ విషాద ఘటన వరంగల్‌..

Telangana: ప్రాణం తీసిన ‘రీల్స్‌’ సరదా.. ఉరి వేసుకుంటున్నట్లు వీడియో తీయబోయాడు! కానీ అంతలోనే..
Fake Hanging
Srilakshmi C
|

Updated on: Jun 20, 2024 | 10:31 AM

Share

నర్సంపేట, జూన్‌ 20: రీల్స్‌ మోజు యువకుడి ప్రాణాలు తీసింది. సరదాగా మెడకు ఉరిని వేసుకుని ఫొటోకు ఫోజులివ్వబోయాడు. కానీ అనుకోకుండా అది మెడకు బిగించుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రాత్రి సమయంలో కావడంతో ఎవరూ గమనించలేదు. దీంతో యువకుడు మృతి చెందాడు. తెల్లారి నిద్రలేచిన తల్లిదండ్రలు ఉరికొయ్యకు వేలాడుతూ కొడుకు కనిపించడంతో గుండెలవిసేలా రోధించారు. ఈ విషాద ఘటన వరంగల్‌ జిల్లా, నర్సంపేటకు మండలంలో మంగళవారం రాత్రి (జూన్‌ 18) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

వరంగల్‌ జిల్లా, నర్సంపేటకు మండలం నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్‌ (23) అనే యువకుడు స్థానికంగా ఓ హోటల్‌లో పని చేస్తుంటాడు. ఖాళీ సమయాల్లో అతడికి మొబైల్‌తో రీల్స్‌ చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన అజయ్‌.. మల్లంపల్లి రోడ్డులోని తన చిన్నక్క ఇంటికి వచ్చాడు. ఉరి వేసుకుంటూ సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌పై సెల్‌ఫోన్‌ని అమర్చి దూలానికి ఉరి తాడు వేశాడు. అనంతరం ఉరి ఉచ్చును తలకు వేసుకుని వీడియో చిత్రీకరిస్తూ ఉన్న క్రమంలో.. అనుకోకుండా మెడకు ఉరి బిగుసుకుంది.

ఊపిరి ఆడకపోవడంతో కొద్ది సేపటికే అజయ్‌ మృతి చెందాడు. బుధవారం ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు అజయ్‌ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలంలో సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ అజయ్‌ తల్లి దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..