TS DSC 2024 Last Date: డీఎస్సీ అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. ఇవాళ్టితో ముగుస్తున్న ఆన్‌లైన్‌ దరఖాస్తులు! పరీక్ష తేదీలివే

తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు గడువు నేటితో (జూన్‌ 20) ముగియనున్నది. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులు ప్రక్రియ బుధవారంతో ముగియగా.. దరఖాస్తు నింపేందుకు గడువు ఈ రోజుతో ముగుస్తుంది. బుధవారం సాయంత్రం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,64,804 మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు ముగింపు..

TS DSC 2024 Last Date: డీఎస్సీ అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. ఇవాళ్టితో ముగుస్తున్న ఆన్‌లైన్‌ దరఖాస్తులు! పరీక్ష తేదీలివే
Telangana DSC 2024
Follow us

|

Updated on: Jun 20, 2024 | 10:11 AM

హైదరాబాద్‌, జూన్‌ 20: తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు గడువు నేటితో (జూన్‌ 20) ముగియనున్నది. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులు ప్రక్రియ బుధవారంతో ముగియగా.. దరఖాస్తు నింపేందుకు గడువు ఈ రోజుతో ముగుస్తుంది. బుధవారం సాయంత్రం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,64,804 మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు ముగింపు సమయం నాటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే మార్చిలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో.. టెట్ ఫలితాల విడుదల తర్వాత అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా డీఎస్సీ అప్లికేషన్ల గడువును జూన్ 20 వరకు పొడిగించింది. ఈ క్రమంలో టెట్‌ 2024లో అర్హత సాధించిన అభ్యర్ధులకు డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. మిగతా వారు యథావిథిగా ఫీజు చెల్లించాల్సిందే. దీంతో బుధవారం సాయంత్రం నాటికి 2,72,798 మంది ఫీజు చెల్లించగా.. వారిలో 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం ముగింపు సమయం నాటికి డీఎస్సీ దరఖాస్తు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. టెట్ ఫలితాలు రిలీజ్ కావడంతో.. డీఎస్సీ అప్లికేషన్ల సవరణకు కూడా అవకాశం ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు 64,556 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను సవరించుకున్నారు. ఇక డీఎస్సీ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ లో జరగనున్న సంగతి తెలిసిందే.

దోస్త్‌ రెండో విడతలో 41,533 మందికి సీట్లు.. ప్రారంభమైన మూడో విడత రిజిస్ట్రేషన్‌

ఇవి కూడా చదవండి

డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. 41,533 మందికి డిగ్రీ సీట్లు లభించాయి. మొత్తం 44,803 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోగా.. వారిలో తక్కువ ఆప్షన్లు ఇచ్చిన 3,270 మందికి సీట్లు దక్కలేదని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. రెండో విడతలో సీట్లు పొందిన వారు జూన్‌ 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి సీటును రిజర్వు చేసుకోవాలని సూచించారు. తొలి విడతలో సీటు పొంది ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసిన వారు.. రెండో విడతలో సీటు పొందితే.. వారు కూడా మళ్లీ ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకోవాలని లేకుంటే సీటు కోల్పోతారని లింబాద్రి తెలిపారు. ఇక మూడో విడతకు జూన్‌ 19 నుంచి జులై 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. జులై 6న సీట్లు కేటాయింపు, జులై 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.