Telangana: ఆర్టీవో ఉద్యోగి నిర్వాకం! చల్లగా బీరు కొడుతూ విధులు నిర్వహణ.. కమిషనర్‌ సీరియస్‌

మహబూబాబాద్‌ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలోని ఓ ఉద్యోగి ఏకంగా ఆఫీస్‌లోనే దుకానం పెట్టాడు. బిందాస్‌గా బీరు కొడుతూ కొలువు వెలగబెడుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో సదరు ఉద్యోగి నిర్వాకం వెలుగు చూసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అతడిని సర్వీస్‌ నుంచి తొలగించి ఇంటికి పంపారు. ఈ షాకింగ్‌ ఘటన జిల్లాలో మంగళవారం చోటు..

Telangana: ఆర్టీవో ఉద్యోగి నిర్వాకం! చల్లగా బీరు కొడుతూ విధులు నిర్వహణ.. కమిషనర్‌ సీరియస్‌
Mahabubabad Rto Employee
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 19, 2024 | 12:11 PM

మహబూబాబాద్‌, జూన్‌ 19: మహబూబాబాద్‌ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలోని ఓ ఉద్యోగి ఏకంగా ఆఫీస్‌లోనే దుకానం పెట్టాడు. బిందాస్‌గా బీరు కొడుతూ కొలువు వెలగబెడుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో సదరు ఉద్యోగి నిర్వాకం వెలుగు చూసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అతడిని సర్వీస్‌ నుంచి తొలగించి ఇంటికి పంపారు. ఈ షాకింగ్‌ ఘటన జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మహబూబాబాద్‌ ఆర్టీవోలో ఉద్యోగి నిర్వాకం.. బీరు తాగుతూ విధులు

మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అయిన సురేష్ డేటాబేస్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. CFST అప్లికేషన్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మేనేజ్‌మెంట్ సర్వీస్‌ వంటి పనులు చేస్తుంటాడు. మంగళవారం ఆఫీస్‌కి వచ్చిన సురేష్‌ వర్కింగ్‌ టైంలో తన సీటులో కూర్చుని, టేబుల్‌పై బీరు పెట్టి.. తాగుతూ విధులు నిర్వర్తించాడు. మత్తులో తూలుతూ పనులు చేస్తున్న అతన్ని లైసెన్స్‌ కోసం వెళ్లిన ఓ వ్యక్తి చూసి, తన ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో అది కాస్తా వైరల్‌గా మా రింది. దీనిపై సమాచారం అందుకున్న డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ సీరియస్‌గా పరిగణించారు. వెంటనే సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అతని స్థానంలో మరో ఉద్యోగిని రిక్రూట్‌ చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్‌లో డీటీఓగా పనిచేస్తున్న సురేశ్‌ను ‘దుష్ప్రవర్తన’, ‘రిక్రూట్‌మెంట్ నిబంధనలు, షరతుల ఉల్లంఘన కారణంగా అతన్ని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.

కాగా ఇటీవల కాలంలో మహబూబాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం వివాదాలకు నిలయంగా మారింది. ఇటీవల ఈ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి.. ఆరుగురు ఏజెంట్లు, ఓ డ్రైవర్‌ వద్ద రూ.46 వేల నగదు సీజ్‌ చేశారు. ఇప్పుడు అక్కడ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి బీరు తాగుతూ నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డీటీవో నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.