Monsoon: తొలకరితోనే సరి పెట్టుకున్న వరుణుడు.. భారీ వర్షాల జాడేది? ఇంకా మొదలవని సాగు పనులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశించిన సమయం కంటే ముందే రాష్ట్రంలోని ప్రవేశించినప్పటికీ.. దాదాపు 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. రుతుపవనాల అడుగిడిన జూన్‌ మొదటి వారంలో మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ.. ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు లేవు. దీంతో పొలాల్లో విత్తనాలు వేసుకునే వెసులుబాటు..

Monsoon: తొలకరితోనే సరి పెట్టుకున్న వరుణుడు.. భారీ వర్షాల జాడేది? ఇంకా మొదలవని సాగు పనులు
Monsoon
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 17, 2024 | 10:13 AM

హైదరాబాద్‌, జూన్‌ 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశించిన సమయం కంటే ముందే రాష్ట్రంలోని ప్రవేశించినప్పటికీ.. దాదాపు 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. రుతుపవనాల అడుగిడిన జూన్‌ మొదటి వారంలో మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ.. ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు లేవు. దీంతో పొలాల్లో విత్తనాలు వేసుకునే వెసులుబాటులేక రైతులు నిరాశకు గురవుతున్నా రు. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ వీరి అంచనాలు తలకిందులయ్యాయి. జూన్‌ 3న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు, జూన్‌ 5 నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి.

జూన్‌ మొదటి వారంలో ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సాధారణంగా తొలకరి జల్లులకే రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడుతారు. కానీ ఈ సారి రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. సీజన్‌ ప్రారంభమై రెండు వారాలైనా ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారీ వర్షం జాడేలేదు. జూన్‌ మొదటి వారంలో కురిసిన తొలకరికి కొన్ని జిల్లాల్లో రైతులు పత్తి, మక్కజొన్న,పెసర పంటల సాగు మొదలు పెట్టారు. విత్తనాలు కూడా చల్లిన తర్వాత వరుణ దేవుడు ముఖం చాటేశాడు. దీంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితులు కనిపించక ఆందోళనకు గురవుతున్నారు. ఐఎమ్‌డీ గణాంకాల ప్రకారం జూన్‌ 1నుంచి జూన్‌ 16 మధ్య కాలంలో రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. మంచిర్యాల, హనుమకొండ, కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైందని పేర్కొంది.

రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి ప్రతి రోజు రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నా.. అది కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఆదివారం నాటికి 69.8 మి.మీ వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్‌ 30నాటికి లోటు వర్షపాతం నమోదైన జిల్లాల్లో కూడా వానలు పుంజుకొని సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని తాజాగా వాతావరణ కేంద్రం తెల్పింది. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న రుతుపవనాల ప్రభావం జూన్‌ చివరి నాటికి రాష్ట్రంవైపు మళ్లుతుందని.. ఫలితంగా జూలై మొదటి వారంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.