Timers in Public Toilets: ఛీ ఛీ.. ఇదెక్కడి తలనొప్పి! పబ్లిక్‌ టాయిలెట్‌లలో టైమర్లు.. మండిపడుతున్న జనాలు

షాపింగ్‌ మాల్‌, సినిమా హాల్‌, పార్కులు.. ఇలా ప్రతీ చోట పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఉంటాయి. సందర్శకులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. భారత్‌లోనే కాకుండా ఏ దేశంలోనైనా ఆయా ప్రభుత్వాలు వీటిని ఏర్పాటు చేస్తుంటాయి. అయితే ఈ దేశంలో మాత్రం పబ్లిక్ టాయిలెట్‌లకు వెళ్తే.. ఠంచన్‌గా బయటకు రావాలి. ఎందుకంటే ప్రతి టాయిలెట్లోనూ టైమర్‌ను అమర్చారు. నిర్ధిష్ట టైంలో బయటకు..

Timers in Public Toilets: ఛీ ఛీ.. ఇదెక్కడి తలనొప్పి! పబ్లిక్‌ టాయిలెట్‌లలో టైమర్లు.. మండిపడుతున్న జనాలు
Timers In Public Toilets
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 16, 2024 | 12:00 PM

చైనా, జూన్ 16: షాపింగ్‌ మాల్‌, సినిమా హాల్‌, పార్కులు.. ఇలా ప్రతీ చోట పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఉంటాయి. సందర్శకులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. భారత్‌లోనే కాకుండా ఏ దేశంలోనైనా ఆయా ప్రభుత్వాలు వీటిని ఏర్పాటు చేస్తుంటాయి. అయితే ఈ దేశంలో మాత్రం పబ్లిక్ టాయిలెట్‌లకు వెళ్తే.. ఠంచన్‌గా బయటకు రావాలి. ఎందుకంటే ప్రతి టాయిలెట్లోనూ టైమర్‌ను అమర్చారు. నిర్ధిష్ట టైంలో బయటకు రాలేదంటే పరేషాన్‌ తప్పదట . అదేంటీ? అని అనుకుంటున్నారా.. అవునండీ బాబూ.. కనీసం టాయిలెట్‌కి కూడా ప్రశాంతంగా వెళ్లలేని సరిస్థితి ఆ దేశ ప్రజలది. దీంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇంతకీ ఏ దేశం అని ఆలోచిస్తున్నారా.. మన దాయాదులు చైనానే.

చైనాలో ఇటీవల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన యుంగాంగ్ బౌద్ధ గ్రోటోస్‌లో ఈ విధమైన టాయిలెట్ టైమర్‌లను ఏర్పాటు చేసింది. చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో ఉన్న యుంగాంగ్ బౌద్ధ గ్రోటోస్ ఓ పురాతన బౌద్ధ దేవాలయం. ఇక్కడ 200పైగా గుహలు, వేలాది బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. యునెస్కో దీనికి ప్రపంచ వారసత్వ హోదా కూడా కల్పించింది. ఇక్కడ నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లలో టైమర్లు ఉన్నాయి. తలుపు ఎంతసేపు క్లోజ్‌ చేసి ఉంచాలి? బాత్రూమ్ లోపల ఎంతసేపు ఉండాలి? టాయిలెట్ ఖాళీగా ఉందా లేదా అనే విషయాలు బాత్రూం పైన అమర్చిన టైమర్‌పై రాసి ఉంటుంది. బాత్రూం ఉపయోగించుకునే సమయాన్ని నిర్ణయించడానికి ఈ టైమర్‌లు ఇన్‌స్టాల్ చేశారనుకుంటే తప్పులో కలేసినట్టే. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం కోసమే ఈ టైమర్లను ఏర్పాటు చేశారట.

పర్యాటకులు బాత్రూంలో అవసరమైన దానికంటే ఎక్కువ సమయం గడుపుతుంటారు. బాత్రూమ్ లోపల వారికి ఏదైనా జరిగితే, అత్యవసర పరిస్థితి తలెత్తితే, అటువంటి పరిస్థితిలో వారిని ఎవరు రక్షిస్తారు? అనే కోణంలో అక్కడి అధికారులు ఆలోచించి.. పర్యాటకుల సౌకర్యార్ధం, భద్రత కోసం వినూత్నంగా ఈ టైమర్లను అమర్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ టైమర్ బాత్రూమ్ వాడే సమయాన్ని లెక్కగట్టదు. ఏ వ్యక్తి అయినా బాత్రూమ్ లోపల తనకు కావలసినంత సమయం గడపవచ్చు. ఈ టైమర్ తలుపు ఎంతసేపు మూసివేసి ఉంది అనే విషయం మాత్రమే టైమర్‌ చూపుతుంది. ఇలా చేస్తే బయట ఉన్న వ్యక్తులు అనవసరంగా తలుపు తట్టాల్సిన అవసరం ఉండదు. అధిక సమయంలో బాత్‌రూమ్‌లో ఉంటే వారి భద్రత కోసం మాత్రమే వీటిని ఏర్పాటు చేశామని, టాయిలెట్‌లో ఎవరు ఎంత సమయం గడపాలనే దానిని నిర్ణయించడం కోసం టైమర్‌ణు సెట్ చేయలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ టైమర్‌లను ఇన్‌స్టాల్ చేయడం వెనుక హేతుబద్ధతను చెబుతున్నప్పటికీ, చైనాలో దీనిపై తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగుతుంది. అక్కడికి వచ్చే పర్యాటకులు తమ ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. బాత్‌రూమ్‌లో గడిపిన సమయాన్ని రికార్డు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా అవమానకరమైన విషయంగా వారు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?