ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు రక్త ప్రసరణలో సమస్యలను కలిగిస్తాయి. సిరలు, ధమనులలో రక్తం గడ్డకట్టడానికి దారి తీసేలా చేస్తుంది. ఫలితంగా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మరోవైపు మధుమేహం పెరిగితే కంటి, గుండె, కిడ్నీ సమస్యలు రావచ్చు. మధుమేహం, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి చాలా మంది వ్యాయామం చేస్తుంటారు. అన్నం, స్వీట్స్ లాంటివి ఎక్కువగా తినడం మానేయడంతోపాటు కొన్ని ముఖ్యమైన ఆహారాలు తప్పక తీసుకోవాలి. ఇవి మధుమేహం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అలాంటి వాటిలో జీడిపప్పు ఒకటి.