- Telugu News Photo Gallery Spiritual photos Palitana: world s first vegetarian city in India’s Gujarat, know the details
Palitana: ప్రపంచంలోనే మొదటి శాకాహార నగరం ఎక్కడుందో తెలుసా..! నగర విశిష్టత ఏమిటంటే..?
భారతదేశం అనేక విశిష్ట ప్రదేశాలకు నిలయం. విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు ఆలవాలయం. అలాంటి మన దేశంలో ఆహార నియమాలు కూడా అనేకం. అయితే మన దేశంలోని ఓ ప్రదేశం ప్రపంచంలోని మొట్టమొదటి శాఖాహార నగరంగా ఖ్యాతిగాంచింది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలిటానా నగరం పూర్తిగా శాఖాహారంగా ప్రపంచ ప్రసిద్దిగాంచింది.
Updated on: Jun 14, 2024 | 6:05 PM

భావ్‌నగర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న నగరం పాలిటానా. ఈ నగరంలో మాంసాహారం వినియోగం పూర్తిగా నిషేధించబడింది. ఈ నగరంలో జంతువులను చంపడం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. అంతేకాదు గుడ్లు లేదా మాంసాన్ని కూడా విక్రయించరు.

భావ్‌నగర్‌కు నైరుతి దిశలో దాదాపు 50 కి.మీ దూరంలో ఉన్న పాలిటానా, మొత్తం ప్రపంచంలో 900 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్న ఏకైక పర్వతంగా ప్రసిద్దిగాంచింది. ఈ పర్వతాన్ని శత్రుంజయ అంటారు. ఆలయ స్థాయికి చేరుకోవాలంటే దాదాపు 3950 మెట్లు ఎక్కాలి.

పాలిటానా నగరం జైనమతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. జైనులకు ఈ పర్వతంతో పాటు అన్ని పాలిటానా దేవాలయాలు మతపరమైన దృక్కోణంలో చాలా ముఖ్యమైనవి. ఇది జైన మతస్తులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర కేంద్రాలు.

జైన మతానికి చెందిన సన్యాసులు భారీ సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. అందుకే ఈ ప్రదేశంలో మాంసాహార విక్రయాలను నిలిపివేయాలని.. జంతువుల వధను నిషేధించాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దాదాపు 200 మంది జైన సన్యాసులు నిరాహారదీక్ష చేయడం ద్వారా నిరాహార దీక్ష చేయడం ద్వారా నిషేధం అమలులోకి వచ్చింది. 2014లో ప్రభుత్వం ఈ ప్రాంతంలో జంతు వధపై నిషేధం విధించింది. ఈ నగరంలో జంతువులను చంపడాన్ని పూర్తిగా నిషేధించింది.

పాలిటానా నగరాన్ని సందర్శించాలనుకున్నట్లు అయితే శత్రుంజయ కొండ, శ్రీ విశాల్ జైన్ మ్యూజియం, హస్తగిరి జైన తీర్థం, గోపనాథ్ బీచ్ మొదలైనవి తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు.

పాలిటానా వందలాది దేవాలయాలకు నిలయం. జైనుల ప్రధాన యాత్రా కేంద్రం కూడా. జైన మతస్తుల రక్షకుడైన ఆదినాథుడు ఒకప్పుడు ఈ కొండలపై నడిచాడని, అప్పటి నుండి ఈ ప్రదేశం అనుచరులకు ముఖ్యమైనదని చెబుతారు. ఎవరైనా ఈ నగరానికి వెళ్ళాలనుకుంటే రైలు, బస్సు లేదా విమానం ద్వారా పాలిటానా నగరానికి చేరుకోవచ్చు. రైలులో వెళుతున్నట్లయి.. భావ్‌నగర్ లేదా అహ్మదాబాద్‌కు రైలులో వెళ్లాలి.




