Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొట్టిన బోలెరో! ఆరుగురు మృతి
ఈ రోజు తెల్లవారు జామున కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం కృత్తివెన్ను NH 216పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బోలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే..
కృష్ణా, జూన్ 14: ఈ రోజు తెల్లవారు జామున కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం కృత్తివెన్ను NH 216పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బోలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..
పాండిచ్చేరి నుండి భీమవరం రొయ్యల ఫీడ్‌తో వెళ్తున్న కంటెయినర్‌ను.. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్ళరేవు నుండి కృత్తివెన్ను మండలం మునిపెడ వస్తున్న బొలెరో వ్యాన్ ఢీ కొట్టింది. శీతనపల్లి వద్ద పుల్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొని ఓవర్ టాక్ చేస్తూ కంటైనర్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా గాయపడిన మరో ఆరుగురిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తుండగా మరొక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. గాయపడిన మిగిలిన ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం మూలంగా రోడ్డుపై రెండు కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది.
మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన కంటైనర్ డ్రైవర్ పేరు, ఇతర వివరాలు తెలియరావాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనంలో డ్రైవర్‌తోపాటు 10 మంది ప్రయాణికులు ఉన్నారని, లారీలో డ్రైవర్‌తోపాటు మరో ప్రయాణికుడు ఉన్నట్లు ఓ ప్రయాణికుడు తెలిపాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.