AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదేందయ్యాఇదీ.. కరెంటు బిల్లు రూ.21 కోట్లా! బిక్క మొహం వేసిన ఇంటి యజమాని

వేసవిలో ప్రతి ఇంట్లో కరెంట్‌ కాస్త ఎక్కువగానే వినియోగిస్తుంటారు. దీంతో మిగతా నెలలతో పోల్చితే వేసవి కాలంలో కొంచెం ఎక్కువగా కరెంట్ బిల్లు వస్తుంది. మహా అయితే మరో వంద రూపాయాలు పెరుగడంతో రూ.300 లేదంటే రూ.500లోపు వస్తుంది. అంతకంటే పెరిగే ఛాన్స్‌ లేదు. కానీ ఓ వ్యక్తికి మాత్రం కరెంట్ బిల్లు చూడగానే గుండె గుబేల్‌మంది. వందలు వేలు.. లక్షలు కూడా కాదు ఏకంగా కోట్లలో కరెంట్‌ బిల్లు..

Telangana: ఇదేందయ్యాఇదీ.. కరెంటు బిల్లు రూ.21 కోట్లా! బిక్క మొహం వేసిన ఇంటి యజమాని
Electricity Bill
Srilakshmi C
|

Updated on: Jun 13, 2024 | 9:21 AM

Share

బిజినేపల్లి, జూన్‌ 12: వేసవిలో ప్రతి ఇంట్లో కరెంట్‌ కాస్త ఎక్కువగానే వినియోగిస్తుంటారు. దీంతో మిగతా నెలలతో పోల్చితే వేసవి కాలంలో కొంచెం ఎక్కువగా కరెంట్ బిల్లు వస్తుంది. మహా అయితే మరో వంద రూపాయాలు పెరుగడంతో రూ.300 లేదంటే రూ.500లోపు వస్తుంది. అంతకంటే పెరిగే ఛాన్స్‌ లేదు. కానీ ఓ వ్యక్తికి మాత్రం కరెంట్ బిల్లు చూడగానే గుండె గుబేల్‌మంది. వందలు వేలు.. లక్షలు కూడా కాదు ఏకంగా కోట్లలో కరెంట్‌ బిల్లు వచ్చింది. ఈ విచిత్ర ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపురంకు చెందిన వేమారెడ్డి ఇంట్లో ఉన్న సర్వీస్‌ నెంబర్‌ 1110000 51 మీటర్‌ కేవలం 0.60 కిలోవాట్‌కు సంబంధించినది. జనవరి 1, 1970 నుంచి జూన్‌ 5, 2024 వరకు 998 రోజులపాటు 297 యూనిట్లు వినియోగించినందుకు గానూ రూ.21,47,48,569 కరెంట్‌ బిల్లు వచ్చింది. ఈ మేరకు జూన్‌ 5న కరెంట్‌ బిల్లు అందుకున్నాడు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో వందల్లో రావాల్సిన తన కరెంట్‌ బిల్లు రూ.కోట్లలో రావడంతో వేమారెడ్డి గుడ్లు తేలేశాడు. అతనికే కాదు గ్రామంలో మరో పదిమందికి ఇలాగే రూ.కోట్లలో బిల్లులు వచ్చినట్టు తేలడంతో ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

అవగాహన లేని బయటి వ్యక్తులతో లైన్‌మెన్‌, జూనియర్‌ లైన్‌మెన్‌ విద్యుత్తు బిల్లులను ఇస్తున్నట్టు సమాచారం. ఇలా విద్యుత్తు శాఖకు సంబంధించిన ప్రతి పనిని ప్రైవేట్‌ వ్యక్తులతో చేయిస్తుండటంతో వారి అవగాహన రాహిత్యంతో కరెంట్‌ బిల్లు తడిసి మోపెడవుతుంది. దీనిపై ఏఈ మహేశ్‌ను వివరణ కోరగా.. సాంకేతిక లోపం కారణంగా బిల్లులు ఎక్కువ వచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకు బిల్లులను వెంటనే సరిచేశామని వివరణ ఇచ్చారు. కాగా తెలంగాణలో గ్రామజ్యోతి పథకం కింద ప్రభుత్వం జీరో బిల్లు అమలు అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో 200 యూనిట్లలోపు కరెంట్‌ వాడితే జీరో బిల్లు అమలు చేస్తోంది. అయితే అందుకు విరుద్ధంగా కొంత మందికి బిల్లులు రూ.లక్షల్లో, రూ.కోట్లల్లో వస్తుండటంతో అవాక్కవుతున్నారు. సాంకేతిక కారణాలతో అక్కడక్కడా ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.