2nd Bird Flu Case in India: భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. కోల్‌కతాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ(H9N2) సంక్రమించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. భారతీయ సంతతికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఆస్ట్రేలియాలో ఉండగా ఈ వ్యాధి సోకింది. వైద్య పరీక్షల్లో చిన్నారికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారనైంది. ఇది జరిగిన దాదాపు మూడు నెలల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌కు వెళ్లడించింది..

2nd Bird Flu Case in India: భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
H9N2 bird flu
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 12, 2024 | 12:03 PM

కోల్‌కతా, జూన్ 12: భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. కోల్‌కతాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ(H9N2) సంక్రమించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. భారతీయ సంతతికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఆస్ట్రేలియాలో ఉండగా ఈ వ్యాధి సోకింది. వైద్య పరీక్షల్లో చిన్నారికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారనైంది. ఇది జరిగిన దాదాపు మూడు నెలల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌కు వెళ్లడించింది. ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. చిన్నారి గత ఫిబ్రవరిలో తల్లిదండ్రులతో కలసి కోల్‌కతాకు వచ్చింది. చిన్నారి కుటుంబం ఫిబ్రవరి చివరిలో సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చింది. ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత చిన్నారికి జ్వరం వచ్చింది. చిన్నారి బ్లడ్ శాంపిల్‌ను పరీక్షించగా ‘బర్డ్‌ ఫ్లూ’ వైరస్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, జ్వరంతో బాధపడిన ఆ చిన్నారిని ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందించారు. కొద్దిరోజుల క్రితమే కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.

ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత గత మే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఈ వార్త చేరింది. దీంతో భారత్‌లోని ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోల్‌కతాలో చిన్నారితో పరిచయం ఉన్న వ్యక్తులకు ఆరోగ్య పరీక్షలు చేసింది. అయితే ఎవరిలోనూ వైరస్‌ కనుగొనలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆలస్యంగా నివేదిక అందినందుకు ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో జరిగిన సంఘటనను మే రెండవ వారంలో నివేదించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా భారత్‌లో ఇది రెండో H9N2 బర్డ్‌ఫ్లూ కేసు. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగా కనిపిస్తాయని వెల్లడించింది. భారత్‌లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించనప్పటికీ వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య కేంద్రం నిఘా పెంచింది.

బర్డ్‌ఫ్లూ H5N2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం అదే అని WHO వెల్లడించింది. సాధారణంగా పక్షులకు మాత్రమే బర్డ్‌ ఫ్లూ సోకే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కోసారి మనుషుల్లో కూడా ఇది కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.