Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ది ట్రయల్’ నటి మృతి.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రుల నిరాకరణ!

బాలీవుడ్ నటి నూర్‌ మాలబికా దాస్‌ (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. ముంబైలో ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో శవమై కనిపించారు. ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూసైడ్ చేసుకుని నటి మృతి చెంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అస్సాంకు చెందిన నూర్‌ మాలబికా దాస్‌..

'ది ట్రయల్' నటి మృతి.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రుల నిరాకరణ!
Actor Noor Malabika Das
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 11, 2024 | 8:26 AM

బాలీవుడ్ నటి నూర్‌ మాలబికా దాస్‌ (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. ముంబైలో ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో శవమై కనిపించారు. ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూసైడ్ చేసుకుని నటి మృతి చెంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అస్సాంకు చెందిన నూర్‌ మాలబికా దాస్‌.. ఖతార్ ఎయిర్‌వేస్‌లో మాజీ ఎయిర్ హోస్టెస్ పనిచేసేవారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ముంబైకి వచ్చారు. అక్కడ లోఖండ్‌వాలాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అయితే ఆమె ఫ్లాట్‌ నుంచి భరించలేని దుర్వాసన రావడంతో ఇరుకు పొరుగు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఫ్లాట్‌ తలుపులు పగలగొట్టి చూడగా నటి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.

విచారణలో భాగంగా ఆమె ఇంటి నుంచి కొన్ని మందులు, మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమె ఫ్లాట్‌లో సూసైడ్‌ నోట్‌ లభించలేదు. దీంతో పోలీసులు ఏడీఆర్‌ నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

నూర్‌ మరణం గురించి వృద్ధాప్య దశలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా ఇటీవలే ముంబయికి వచ్చివెళ్లామని, కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మళ్లీ రాలేమంటూ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె స్నేహితుడు, నటుడు అలోక్‌నాథ్‌ పాఠక్‌ ఓ ఎన్‌జీవో సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె 2023 లీగల్ డ్రామా ‘ది ట్రయల్’ వెబ్‌ సిరీస్‌లో కాజోల్‌కి సహనటిగా నటించారు. ఆ తర్వాత పలు వెబ్‌ షోల్లో నటించారు. నూర్‌ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, హోం మంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లను ‘ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌’ కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.