Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Temper Movie : ఓర్నీ..! టెంపర్ మూవీ బుడ్డోడు.. ఇప్పుడు ఎంతలా మారిపోయాడు..!!

ఎన్టీఆర్ నటనకు ఉదాహరణగా ఒక సినిమా అని చెప్పలేం.. ప్రతి సినిమాలో తనదైన స్టైల్ లో నటించి ఫిదా చేశాడు. విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు తారక్. ఎన్టీఆర్ మెప్పించిన సినిమాల్లో టెంపర్ మూవీ ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఇరగదీశాడు.

Temper Movie : ఓర్నీ..! టెంపర్ మూవీ బుడ్డోడు.. ఇప్పుడు ఎంతలా మారిపోయాడు..!!
Temper
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2024 | 8:07 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్ పండగ చేసుకుంటారు. ఆయన సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చిన చాలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు. అంతలా అభిమానులు సొంతం చేసుకున్నాడు తారక్. తన నటనతో, డాన్స్ లతో దేశంమొత్తం తనకు ఫిదా అయ్యేలా చేశాడు. కాగా ఎన్టీఆర్ నటనకు ఉదాహరణగా ఒక సినిమా అని చెప్పలేం.. ప్రతి సినిమాలో తనదైన స్టైల్ లో నటించి ఫిదా చేశాడు. విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు తారక్. ఎన్టీఆర్ మెప్పించిన సినిమాల్లో టెంపర్ మూవీ ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఇరగదీశాడు.

నెగిటివ్ రోల్ లో ప్రేక్షకులను మెప్పించారు. పూరి డైలాగ్స్ , ఎన్టీఆర్ యాక్టింగ్ ఆడియస్ చేత థియేటర్స్ లో విజిల్స్ కొట్టించాయి. దయలేని దయ పాత్రలో తారక్ కుమ్మేశారు. అయితే ఈ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్ గా నటించిన బుడతడు గుర్తున్నాడా.? పోలీస్ అవుతా , పోలీస్ డ్రస్ ఇస్తా అంటూ డైలాగ్ చెప్పి పోలీస్ స్టేషన్ ను బయట ఉన్న జీప్ పైకి దూకుతాడు ఈ చిన్నోడు. ఈ ఎలివేషన్ కూడా అదిరిపోతుంది. అయితే ఆ చిన్నోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు.? ఏం చేస్తున్నాడో తెలుసా.?

చాలా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు ఆ చిన్నోడు. అతని పేరు ప్రేమ్ బాబు. ఈ బుడతడు చాలా సినిమాల్లో కనిపించాడు. అలాగే మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన బుడుగు సినిమాలో ఈ చిన్నోడు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రేమ్ టీనేజ్ లోకి మారిపోయాడు. ప్రస్తుతం చదువుల పై దృష్టి పెట్టాడు. ప్రేమ్ బాబు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. అడపాదడపా అతని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ప్రేమ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన ఆడియన్స్ షాక్ అవుతున్నారు. నువ్వేనా అంటూ అవాక్ అవుతున్నారు.

ప్రేమ్ బాబు ఇన్ స్టా..

View this post on Instagram

A post shared by Prem Babu (@actor_prembabu)

ప్రేమ్ బాబు ఇన్ స్టార్..

View this post on Instagram

A post shared by Prem Babu (@actor_prembabu)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..