Vijay Sethupathi: హీరోయిన్‌కి తండ్రిగా అందుకే నటించా.. విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ నెల 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. నిథిలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలను ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. కాగా ప్రస్తుతం...
విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన ప్రత్యేకతతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు విజయ్. అద్భుత నటనతో పాత్రకు ప్రాణంపోసి నటించే విజయ్ సినిమాపై ఎంతటి డెడికేషన్‌తో ఉంటారో తెలిసిందే. ఇక వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు విజయ్. ఈ సినిమాలో కృతిశెట్టికి తండ్రిగా తన అద్భుత నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ నెల 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. నిథిలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలను ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. కాగా ప్రస్తుతం మహారాజా మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విజయ్ తాజాగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఉప్పెన సినిమాలో తండ్రి పాత్రలో నటించడానికి అసలు కారణాన్ని బయటపెట్టాడు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా కేవలం బుచ్చిబాబు కోసమే చేశానని చెప్పుకొచ్చిన విజయ్, సినిమాపై బుచ్చి బాబుకు ఉన్న ప్యాషన్ చూసి ఒప్పుకున్నాను అన్నారు. హీరోయిన్‌కి తండ్రి పాత్రలో నటించడానికి మామూలుగా అయితే తనలాంటి యాక్టర్స్ వెనకడుగు వేస్తారని, కానీ బుబ్చిబాబు కోసం తక్కువ రెమ్యునరేషన్ తీసుకొని మరీ సినిమాలో నటించానని చెప్పుకొచ్చారు.
I did #Uppena only because of @BuchiBabuSana , Less Remuneration కి ఆ సినిమా చేశాను – #VijaySethupathi pic.twitter.com/qRBIGwwFho
— Rajesh Manne (@rajeshmanne1) June 10, 2024
ఇక మరో ఇంటర్వ్యూలో రామోజీరావు మృతిపై కూడా విజయ్ స్పందించారు. రామోజీరావు ఇక లేరన్న వార్త విని ఎంతో బాధపడ్డానని, రామోజీ ఫిల్మ్‌సిటీతో తనకు ఎంతో అనుబంధముందని చెప్పారు. 2005లో ధనుష్ సినిమా కోసం తొలిసారి ఫిల్మ్‌సిటీకి వెళ్లానని, అది చూశాక ఒక్క వ్యక్తి ఇంత సాధించగలడా అనిపించిందని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..