Thalapathy Vijay: హీరో దళపతి విజయ్ గొప్ప మనసు.. 10,12 తరగతి ల టాపర్లకు సాయంతో పాటు సన్మానం

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. సినిమాల్లో సూపర్ స్టార్ గా వెలుగొందుతోన్న విజయ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీని కూడా స్థాపించారు.

Thalapathy Vijay: హీరో దళపతి విజయ్ గొప్ప మనసు.. 10,12 తరగతి ల టాపర్లకు సాయంతో పాటు సన్మానం
Thalapathy Vijay
Follow us
Basha Shek

|

Updated on: Jun 11, 2024 | 7:25 AM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. సినిమాల్లో సూపర్ స్టార్ గా వెలుగొందుతోన్న విజయ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీని కూడా స్థాపించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయ్ ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా రాజకీయాల్లోకి రాక ముందే పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు విజయ్. కొన్ని నెలల క్రితం తమిళనాడు వరద బాధితులకు భారీ గా విరాళాలు ఇచ్చాడు. అలాగే 12వ తరగతి పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులకు ప్రోత్సాహకర బహుమతులు అందజేశాడు. కాగా గతేడాది 12వ తరగతి పరీక్షలో 600/600 మార్కులు సాధించిన నందినికి డైమండ్‌ నెక్లెస్‌ ను కానుకగా ఇచ్చాడు. అఅలాగే మరో రెండు వేల మంది ఉత్తమ విద్యార్థులకు ఆర్థిక సాయం చేశాడు. ఇప్పుడు కూడా మరోసారి విద్యార్థులకు సాయ మందించేందుకు రెడీ అయ్యాడు దళపతి విజయ్. ఈ ఏడాది 10,12 తరగతుల్లో టాపర్‌గా నిలిచిన వారికి సర్టిఫికెట్‌తో పాటు రివార్డులను అందజేయనున్నారీ స్టార్ హీరో. ఈ విషయాన్ని ఆయన టీవీకే పార్టీ ప్రతినిధులు ప్రకటించారు.

జూన్ 28, జూలై 3 తేదీలలో చెన్నైలోని తిరువాన్మియూర్‌లో ఈ విద్యార్థుల సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీవీకే పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులను సన్మానించనున్నట్లు పార్టీ ప్రకటించింది. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో 10, 12వ తరగతి ఫలితాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంచుకుని వారందరినీ పిలిపించి బహుమతులు అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దళపతి విజయ్ ప్రస్తుతం ‘గోట్‌’ చిత్రంలో నటిస్తున్నారు. సురేశ్ ప్రభు డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ విజయదశమి కానుకగా సెప్టెంబర్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.

blockquote class=”twitter-tweet”>

தமிழ்நாடு, புதுச்சேரியில் அண்மையில் நடைபெற்ற 12 மற்றும் 10ஆம் வகுப்புப் பொதுத் தேர்வுகளில் தேர்ச்சி பெற்ற மாணவச் செல்வங்கள் அனைவருக்கும் நெஞ்சார்ந்த பாராட்டுகள். மற்றவர்கள் தன்னம்பிக்கையுடன் மீண்டும் முயன்று, வெற்றி பெற வாழ்த்துகள்.

விரைவில் நாம் சந்திப்போம்! pic.twitter.com/OUYZYhl5Ni

— TVK Vijay (@tvkvijayhq) May 10, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.