AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramcharan: మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే న్యూస్.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చరణ్ బాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అధికార పార్టీ వైఎస్సారీసీపిని చిత్తు చేస్తూ ఏకంగా 164 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. తద్వారా ఏపీలో మరోసారి చంద్రన్న ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

Ramcharan: మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే న్యూస్.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చరణ్ బాబు
Ram Charan, Chandrababu Naidu
Basha Shek
|

Updated on: Jun 10, 2024 | 10:34 PM

Share

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అధికార పార్టీ వైఎస్సారీసీపిని చిత్తు చేస్తూ ఏకంగా 164 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. తద్వారా ఏపీలో మరోసారి చంద్రన్న ప్రభుత్వం ఏర్పాటు కానుంది. బుధవారం (జూన్ 12వ తేదీ) ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గరలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్కులో సుమారు 11 ఎకరాలు స్థలంలో బాబు ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. చంద్రబాబుతో పాటు క్యాబినేట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఏపీలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన జనసేన ఎమ్మెల్యేలు కూడా క్యాబినేట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ, క్రీడా, రాజకీయ పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి మెగా పవర్ స్టరా్ రామ్ చరణ్ బాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

కాగా రామ్ చరణ్  ప్రస్తుతానికి గేమ్ ఛేంజర్  సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం  రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. అలాగే తెలుగమ్మాయి అంజలి మరో కీలక పాత్ర పోషిస్తోంది. వీరితో పాటు ఎస్ జే సూర్య, సునీల్, శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర, నాజర్, సునీల్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు అందిస్తున్నారు. విజయదశమి కానుకగా ఈ ఏడాది అక్టోబర్ లో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కావొచ్చునని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

రామోజీరావుకు నివాళులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.