AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy 1st Woman Pilot: అసాధారణ అనామిక.. ఇండియన్‌ నేవీలో తొలి మహిళా పైలట్‌గా రికార్డు.. ‘గోల్డెన్‌ వింగ్స్‌’ ప్రధానం

సబ్-లెఫ్టినెంట్ అనామిక బి రాజీవ్ అరుదైన ఘనత దక్కింది. తమిళనాడులోని అరక్కోణంలోని నౌకాదళ ఎయిర్ స్టేషన్‌లో జరిగిన పాసింగ్-అవుట్ పరేడ్‌లో ప్రతిష్టాత్మకమైన 'గోల్డెన్ వింగ్స్' అందుకున్నారు. దీంతో భారత నావికాదళానికి మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్‌గా ఆమెను ప్రకటించారు. ఐఎన్‌ఎస్ రాజాలిలో జరిగిన పాసింగ్-అవుట్ పరేడ్‌లో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్..

Indian Navy 1st Woman Pilot: అసాధారణ అనామిక.. ఇండియన్‌ నేవీలో తొలి మహిళా పైలట్‌గా రికార్డు.. 'గోల్డెన్‌ వింగ్స్‌' ప్రధానం
Indian Navy 1st Woman Pilot
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 10, 2024 | 11:40 AM

చెన్నై, జూన్‌ 9: సబ్-లెఫ్టినెంట్ అనామిక బి రాజీవ్ అరుదైన ఘనత దక్కింది. తమిళనాడులోని అరక్కోణంలోని నౌకాదళ ఎయిర్ స్టేషన్‌లో జరిగిన పాసింగ్-అవుట్ పరేడ్‌లో ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్ వింగ్స్’ అందుకున్నారు. దీంతో భారత నావికాదళానికి మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్‌గా ఆమెను ప్రకటించారు. ఐఎన్‌ఎస్ రాజాలిలో జరిగిన పాసింగ్-అవుట్ పరేడ్‌లో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ చేతుల మీదుగా ఆమె గోల్డెన్ వింగ్స్ అందుకున్నారు. అలాగే లఢక్‌కు చెందిన మొదటి కమిషన్డ్‌ నౌకాదళ అధికారి లెఫ్టినెంట్‌ జమ్యాంగ్‌ త్సెవాంగ్‌ సైతం క్వాలిఫైడ్‌ హెలికాప్టర్‌ పైలట్‌గా పట్టభద్రురాలయ్యారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ వింగ్స్ అందుకున్న మొత్తం 21 మంది అధికారులు సబ్-లెఫ్టినెంట్ రాజీవ్, లెఫ్టినెంట్ త్సెవాంగ్‌లు ఉన్నారు.

భారత నావికాదళానికి చెందిన అన్ని హెలికాప్టర్ పైలట్ల అల్మా మేటర్ అయిన ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ 561లో 22 వారాలపాటు సాగిన కఠినమైన ఫ్లయింగ్, గ్రౌండ్ శిక్షణ విజయవంతంగా పూర్తికావడంతో శుక్రవారం ఈ పరేడ్‌ జరిగింది. లింగ అసమానలతను తొలగించి, కెరీర్‌ అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో ఇండియన్‌ నేవీ నిబద్ధతను ఈ కార్యక్రమంలో హైలెట్ చేశారు. సబ్-లెఫ్టినెంట్ అనామికా బి రాజీవ్ మొదటి మహిళా నావల్ హెలికాప్టర్ పైలట్‌గా పట్టభద్రుడయ్యి చరిత్ర సృష్టించారని నేవి ప్రకటించింది. దీంతో అనామిక రాజీవ్‌ సీ కింగ్స్‌, ఏఎల్‌హెచ్‌ ధ్రువ్స్‌, చేతక్స్‌, ఎంహెచ్‌-60ఆర్‌ వంటి హెలికాప్టర్‌లు నడపడానికి అర్హత సాధించిన తొలి మహిళా పైలట్‌గా నిలిచారు.

2018లో భారత వైమానిక దళానికి చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ అవనీ చతుర్వేది ఒంటరిగా యుద్ధ విమానాన్ని నడిపిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె తొలిసారిగా సోలో ఫ్లైట్‌లో MiG-21 బైసన్‌ను నడిపారు. జూలై 2016లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా నియమితులైన ముగ్గురు సభ్యుల మహిళా బృందంలో చతుర్వేది ఒకరు. తాజాగా 102వ హెలికాప్టర్ కన్వర్షన్ కోర్సులో కొత్తగా అర్హత సాధించిన పైలట్‌లను భారత నావికాదళంలోని వివిధ ఫ్రంట్‌లైన్ ఆపరేషనల్ యూనిట్‌లకు నియమించింది. వీరు నిఘా, సెర్చ్‌, రెస్క్యూ, యాంటీ పైరసీ వంటి విభిన్న మిషన్‌లలో విధులు నిర్వహిస్తారని నేవీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.