AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangla MP Case: బంగ్లా ఎంపీ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. కాలువలో కుళ్లిన స్థితిలో దొరికిన కీలక అధారాలు

చికిత్స కోసం పశ్చిమ బెంగాల్‌ వచ్చిన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ (53) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత నెల 12న ఆయన కోల్‌కతాలోని తన స్నేహితుడి ఇంటికి రాగా ఆ తర్వాత అనూహ్యంగా మే 17 నుంచి కనిపించకుండా పోయారు. ఓ మహిళ ద్వారా హనీట్రాప్‌లోకి దింపి, కోల్‌కతాలోని న్యూ టౌన్‌ అపార్టుమెంటులో హత్య చేసి ఆయన శరీర భాగాలు మాయం చేసేందుకు యత్నించిన దుండగుల..

Bangla MP Case: బంగ్లా ఎంపీ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. కాలువలో కుళ్లిన స్థితిలో దొరికిన కీలక అధారాలు
Bangla MP Case
Srilakshmi C
|

Updated on: Jun 09, 2024 | 5:43 PM

Share

కోల్‌కతా, జూన్ 9: చికిత్స కోసం పశ్చిమ బెంగాల్‌ వచ్చిన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ (53) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత నెల 12న ఆయన కోల్‌కతాలోని తన స్నేహితుడి ఇంటికి రాగా ఆ తర్వాత అనూహ్యంగా మే 17 నుంచి కనిపించకుండా పోయారు. ఓ మహిళ ద్వారా హనీట్రాప్‌లోకి దింపి, కోల్‌కతాలోని న్యూ టౌన్‌ అపార్టుమెంటులో హత్య చేసి ఆయన శరీర భాగాలు మాయం చేసేందుకు యత్నించిన దుండగుల కుట్రను పోలీసులు ఒక్కొక్కటిగా చేధిస్తున్నారు. ఆయన శరీర భాగాల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న క్రమంలో.. ఎంపీ హత్యకు గురైన అపార్ట్‌మెంట్‌ సెప్టిక్‌ ట్యాంకులో ఇటీవల మూడున్నర కిలోల మాంసం ముద్దలు లభ్యమైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ కాలువలో మానవ ఎముకలను గుర్తించారు. వెస్ట్ బెంగాల్ సీఐడీ దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కాలువ సమీపంలో ఆదివారం మానవ ఎముకల భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి నేపాల్‌ పోలీసులు అరెస్టు చేసిన కీలక నిందితుడు మహ్మద్‌ సియామ్‌ హుస్సేన్‌ను గత శుక్రవారం భారత్‌కు తీసుకువచ్చారు. ఎంపీ శరీర భాగాలు, నేరానికి ఉపయోగించిన సాధనాలను గుర్తించడంలో సీఐడీకి సహాయం చేసేందుకు ఆదివారం న్యూ టౌన్ ఫ్లాట్‌కు అతన్ని తీసుకెళ్లారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు గాలింపు చేపట్టిగా, హత్యకు గురైన ఎంపీ శరీర భాగాల ఎముకలు భాంగర్‌లోని కృష్ణమతి గ్రామంలోని బాగ్జోల కాలువ ఆగ్నేయ ఒడ్డున లభించినట్లు ఆయన తెలిపారు. వైద్యులు, ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో గాలింపు జరపగా.. ఆ కాలువలో లభ్యమైన ఎముకలు మనిషికి సంబంధించినవిగా వారు స్పష్టం చేశారు. వాటిని ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం పంపిస్తాం, ఇతర శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు సీఐడీ పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పటికే అపార్ట్‌మెంట్‌ సెప్టిక్‌ ట్యాంకు నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు మూడున్నర కిలోల మాంసపు ముద్దను హత్యకు గురైన ఎంపీవా.. కావా.. అనే విషయం నిర్ధారించడం అధికారులకు కష్టసాధ్యంగా మారింది. దీంతో డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం బాధిత ఎంపీ కుమార్తె బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కతాకు వచ్చే వారం రానున్నారు.

కాగా హత్యకు గురైన బంగ్లా ఎంపీని అతడి సన్నిహితుడే నిందితులకు దాదాపు రూ.5 కోట్లు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రధాన కుట్రదారుడు అక్తరుజ్జమాన్ అమెరికా పౌరుడిగా గుర్తించారు. అక్తరుజ్జమాన్‌కు కోల్‌కతాలో ఓ ఫ్లాంట్‌ ఉందని, ప్రస్తుతం అతడు అమెరికాలో ఉంటున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఎంపీని మొదట గొంతు నులిమి చంపి, ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఆధారాలను మాయం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..