AP Schools Reopen Date: పాఠశాల విద్యార్ధులకు అలర్ట్‌.. స్కూల్స్ రీ ఓపెన్‌ తేదీలో స్వల్పమార్పు! కారణం ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన జూన్‌ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు...

AP Schools Reopen Date: పాఠశాల విద్యార్ధులకు అలర్ట్‌.. స్కూల్స్ రీ ఓపెన్‌ తేదీలో స్వల్పమార్పు! కారణం ఇదే
AP Schools Reopen date changed
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 06, 2024 | 4:05 PM

అమరావతి, జూన్‌ 6: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన జూన్‌ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మరోవైపు వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు అదే రోజు పునఃప్రారంభంకానున్నాయి.

ఈ నేపథ్యంలో పాఠశాలలను ఈనెల 12కు బదులు 13న తెరవాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అందులో కోరారు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తుండడంతో వాయిదా వేయాలని వినతి చేశారు. దీంతో ఏపీలో స్కూల్స్ రీ ఓపన్ తేదీ వాయిదాపడే అవకాశం ఉంది.

కాగా రాష్ట్రంలోని పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలవుల అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్‌ 12 నుంచి స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి. తాజా పరిణామంతో ఒకరోజు తర్వాత అంటే జూన్‌ 13న స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలోనూ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమైన వేసవి సెలవులు జూన్‌ 11తో ముగియనున్నాయి. జూన్‌ 12న బడులు తిరిగి ప్రారంభం అవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.