Youngest MP’s: పార్లమెంటుకు ఎంపికైనా నలుగురు యంగెస్ట్ ఎంపీలు.. బ్యాంక్ గ్రౌండ్ చూస్తే పరేషాన్ పక్కా!
తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొత్తతరం పార్లమెంటులో అడుగుపెట్టనుంది. ఏకంగా 25 యేళ్ల వయసు కలిగిని నలుగురు యువ ఎంపీలు ఈసారి ఎన్నికయ్యారు. ఆ నలుగురు ఎంపీలు పార్లమెంటు దిగువ సభకు ఎన్నికయ్యారు. నలుగురు ఎంపీల్లో ముగ్గురు యువతులు కావడం మరోవిశేషం. వీరిలో పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్.. సమాజ్‌వాదీ పార్టీ నుంచి గెలుపొందగా, శాంభవి చౌదరీ, సంజన జాతవ్.. లోక్‌జనశక్తి, కాంగ్రెస్ పార్టీల నుంచి..
న్యూఢిల్లీ, జూన్ 5: తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొత్తతరం పార్లమెంటులో అడుగుపెట్టనుంది. ఏకంగా 25 యేళ్ల వయసు కలిగిని నలుగురు యువ ఎంపీలు ఈసారి ఎన్నికయ్యారు. ఆ నలుగురు ఎంపీలు పార్లమెంటు దిగువ సభకు ఎన్నికయ్యారు. నలుగురు ఎంపీల్లో ముగ్గురు యువతులు కావడం మరోవిశేషం. వీరిలో పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్.. సమాజ్‌వాదీ పార్టీ నుంచి గెలుపొందగా, శాంభవి చౌదరీ, సంజన జాతవ్.. లోక్‌జనశక్తి, కాంగ్రెస్ పార్టీల నుంచి విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 726 మంది మహిళలు పోటీ చేయగా.. వారిలో 78 మంది ఎన్నికయ్యారు. ఎంపీలలో 11.7% మంది మహిళలు ఉన్నారు.
శాంభవి చౌదరీ
శాంభవి చౌదరీ.. ఆమె బీహార్‌లోని నితీశ్ కుమార్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న అశోక్ చౌదరీ కుమార్తె. సమస్తిపుర్ నియోజకవర్గం నుంచి శాంభవి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీపై విజయం సాధించారు. సన్నీ హజారీ JD(U) మంత్రి మహేశ్వర్ హజారీ కుమారుడు.
సంజన జాతవ్
సంజన జాతవ్.. రాజస్థాన్‌లోని భరత్‌పుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈ పాతికేళ్ల యువతి బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్ కోహ్లీపై 51,983 ఓట్ల తేడాతో గెలుపొందింది. ఆమె 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రమేశ్ ఖేడీ చేతిలో కేవలం 409 ఓట్ల తేడాతో ఓడిపోయింది. సంజన రాజస్థాన్ పోలీసు కానిస్టేబుల్ కప్తాన్ సింగ్‌ను వివాహం చేసుకుంది. కష్టపడి పనిచేసే వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాకు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, సచిన్ పైలట్, అశోక్ గహ్లాట్ నాకు స్పూర్తి అని మీడియాతో అన్నారు. ఆరోగ్యం, నిరుద్యోగం, నీటి సమస్యలను పరిష్కరించేందుకు పోరాడతానని ఆమె పేర్కొంది.
VIDEO | Lok Sabha Elections 2024: Here’s what Sanjana Jatav, one of the youngest MPs in Lok Sabha, said about her win from Bharatpur constituency. She hails from Dalit community.
“The one who does hard work, always progresses. We did not stop during campaign. Party has given me… pic.twitter.com/Jo1uu3Vc1q
— Press Trust of India (@PTI_News) June 5, 2024
పుష్పేంద్ర సరోజ్
పుష్పేంద్ర సరోజ్.. క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అకౌంటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. తాజా ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున కౌషాంబి పార్లమెంటరీ సీటు నుంచి పోటీ చేసి బీజేపీ తరపున రెండు సార్లు ఎంపీగా గెలిచిన వినోద్ కుమార్ సోన్కర్‌పై లక్ష మెజారిటీతో విజయం సాధించాడు. దీంతో లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యూపీ మాజీ మంత్రి ఇంద్రజిత్ సరోజ్ కుమారుడే ఈ పుష్పేంద్ర.
ప్రియా సరోజ్
ప్రియా సరోజ్.. ఆమె 25 యేళ్ల సుప్రీంకోర్టు న్యాయవాది. మచ్చిలిషార్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాద్ పార్టీ తరపున పోటీ చేసిన ప్రియా సరోజ్ సుమారు 35వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ ఎంపీ బోలానాథ్‌ను చిత్తుగా ఓడించారు. మూడు సార్లు ఎంపీగా గెలిచిన తూఫానీ సరోజ్ కుమార్తే ఈ ప్రియా సరోజ్.