Bengal: ఈవీఎంలను చెరువులోకి విసిరి.. బాంబులతో దాడి.. ఇప్పటికి వీడియో వైరల్.

Bengal: ఈవీఎంలను చెరువులోకి విసిరి.. బాంబులతో దాడి.. ఇప్పటికి వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Jun 05, 2024 | 5:35 PM

లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్‌లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు పోలింగ్‌ జరుగుతోంది. బెంగాల్‌ జయనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ అల్లరిమూక పోలింగ్ స్టేషన్‌లోకి చొరబడి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని చెరువులో విసిరేసిన ఘటనతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుల్తాలీ గ్రామంలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో స్థానికులకు..

లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్‌లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు పోలింగ్‌ జరుగుతోంది. బెంగాల్‌ జయనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ అల్లరిమూక పోలింగ్ స్టేషన్‌లోకి చొరబడి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని చెరువులో విసిరేసిన ఘటనతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుల్తాలీ గ్రామంలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో స్థానికులకు, పోలింగ్‌ ఏజెంట్లకు మధ్య వివాదం చెలరేగింది. బేనిమాధవ్‌పూర్ ఎఫ్‌పి స్కూల్ బూత్‌లోకి ఏజెంట్లను రానీయకుండా కొంతమంది అడ్డుకోవడంతో కలకలం రేగింది. వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్(VVPAT)తో కూడిన ఈవీఎంను బయటకు తీసుకెళ్లి చెరువులో పడేశారు.

ఘటనపై సెక్టార్ ఆఫీసర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెక్టార్ పరిధిలోని మొత్తం ఆరు బూత్‌లలో పోలింగ్ ప్రక్రియ అంతరాయం లేకుండా సాగిందనీ, ఈవీఎంను చెరువులో పడేసిన చోట కొత్త ఈవీఎం, పేపర్లను సెక్టార్ అధికారికి అందించినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. మరో ఘటనలో కోల్‌కతాలోని జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని భాంగర్‌లోని సతులియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF), సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. అనంతరం ఇరువర్గాలు పరస్పరం బాంబులతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో పలువురు ఐఎస్‌ఎఫ్‌ సభ్యులు గాయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.