DK Aruna: కేంద్ర మంత్రి పదవి రేసులో డీకే అరుణ.. మహబూబ్‌నగర్ ఎంపీ ఏమన్నారంటే..?

మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తన విజయంపై మొదటి నుంచి విశ్వాసం ఉందన్నారు ఎంపీ డీకే అరుణ. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ ఓటుకు వెయ్యి చొప్పున పంచిందని ఆరోపించారు. అయినా ప్రజల అశీర్వాదంతో తాను గెలిచానని చెప్పారు. జిల్లా ప్రజల కోసం శాయశక్తులా పనిచేస్తానని.. అభివృద్ధి కోసం కేంద్రంతో రాష్ట్రం కలిసి పనిచేయాలని సూచించారు.

Follow us

|

Updated on: Jun 05, 2024 | 4:47 PM

మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచిన డీకే అరుణకు మోదీ 3.O కేబినెట్‌లో చోటు దక్కే అవకాశముందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో చిట్‌చాట్, టీవీ9తో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ నియోజకవర్గంలో తన విజయంపై మొదటి నుంచి విశ్వాసం ఉందన్నారు డీకే అరుణ. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ ఓటుకు వెయ్యి చొప్పున పంచిందని ఆరోపించారు. అయినా ప్రజల అశీర్వాదంతో తాను గెలిచానని చెప్పారు. జిల్లా ప్రజల కోసం శాయశక్తులా పనిచేస్తానని.. అభివృద్ధి కోసం కేంద్రంతో రాష్ట్రం కలిసి పనిచేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని తాము కోరడం లేదన్నారు. రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి హద్దులు దాటి అబద్ధాలు ప్రచారం చేశారని విమర్శించారు. తమ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి పనిచేశాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. తనకు ఏ పదవి ఇవ్వాలో ప్రధాని మోదీ నిర్ణయిస్తారని తెలిపారు. పార్టీ ఏ పదవి అప్పగించినా నిర్వహిస్తానని చెప్పారు. అదే సమయంలో కేంద్ర మంత్రి పదవి కోసం తాను లాబీయింగ్ చేయబోనని స్పష్టంచేశారు.

మహబూబ్ నగర్ ఓట్ల లెక్కింపు మంగళవారంనాడు హోరాహోరీగా సాగింది. చివరకు డీకే అరుణ 4500 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై విజయం సాధించారు. డీకే అరుణకు 5,10,747 ఓట్లు పోల్ కాగా.. వంశీచంద్ రెడ్డి 5,06,247 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి 1,54,792 ఓట్లతో మూడోస్థానానికి పరిమితం అయ్యారు.

వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు తెలుసా..
వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు తెలుసా..
అత్యవసర సమయాల్లో రిజర్వేషన్‌ ట్రైన్‌ టికెట్‌ పొందడం ఎలా?
అత్యవసర సమయాల్లో రిజర్వేషన్‌ ట్రైన్‌ టికెట్‌ పొందడం ఎలా?
ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..
ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..
పూజ సమయంలో ఉల్లి, వెల్లుల్లిని తినడం ఎందుకు నిషేధించారో తెలుసా..
పూజ సమయంలో ఉల్లి, వెల్లుల్లిని తినడం ఎందుకు నిషేధించారో తెలుసా..
వామ్మో.. వర్షాకాలంలో ఈ పండ్లు తింటే ఇన్ని ప్రయోజనాలా?
వామ్మో.. వర్షాకాలంలో ఈ పండ్లు తింటే ఇన్ని ప్రయోజనాలా?
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు.. పేదలకు తీపికబురు చెప్పిన మంత్రి..
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు.. పేదలకు తీపికబురు చెప్పిన మంత్రి..
జూలై 5 లేదా 6 జ్యేష్ట అమావాస్య ఎప్పుడు పితృ దేవతలను ఇలా పూజించండి
జూలై 5 లేదా 6 జ్యేష్ట అమావాస్య ఎప్పుడు పితృ దేవతలను ఇలా పూజించండి
ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు.
ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు.
అద్వానీకి మళ్ళీ అస్వస్థత .. అపోలో ఆస్పత్రిలో చేరిక..
అద్వానీకి మళ్ళీ అస్వస్థత .. అపోలో ఆస్పత్రిలో చేరిక..
హమ్మయ్య..! దిగివచ్చిన పసిడి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..
హమ్మయ్య..! దిగివచ్చిన పసిడి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..