Delhi: ఢిల్లీలో ఎండలకు నిదర్శనం ఈ వీడియో.! వైరల్..

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా భానుడు చెలరేగిపోయాడు. ఫలితంగా కనీవినీ ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే సూర్యతాపానికి జనం తల్లడిల్లిపోయారు. సాయంత్రమైనా కాలు బయటపెట్టేందుకు భయపడ్డారు. రెండ్రోజుల క్రితం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఢిల్లీలో నమోదైంది. వడగాలులకు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

Delhi: ఢిల్లీలో ఎండలకు నిదర్శనం ఈ వీడియో.! వైరల్..

|

Updated on: Jun 05, 2024 | 6:01 PM

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా భానుడు చెలరేగిపోయాడు. ఫలితంగా కనీవినీ ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే సూర్యతాపానికి జనం తల్లడిల్లిపోయారు. సాయంత్రమైనా కాలు బయటపెట్టేందుకు భయపడ్డారు. రెండ్రోజుల క్రితం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఢిల్లీలో నమోదైంది. వడగాలులకు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఎండ వేడికి అద్దంపట్టే వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.

ఓ భవనంపైన ఉన్న నీళ్ల ట్యాంకులోని నీళ్లు కింద మంటపెట్టినట్టుగా సలసలా మరుగుతున్నాయి. ఉష్ణోగ్రత 52 డిగ్రీలకు చేరుకోవడంతో ట్యాంకులోని నీళ్లు ఇలా మరిగిపోతున్నాయంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను నెట్టింట షేర్‌ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. కొందరు.. అమ్మో.. ఈ వేడికి ఢిల్లీ జనం ఎలా బతుకుతున్నారో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తే మరికొందరు మాత్రం ఈ వీడియో ఫేక్ అని కొట్టిపడేస్తున్నారు. నీళ్ల బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీలని, 52 డిగ్రీల వద్ద నీళ్లు మరగడం అసాధ్యమని అంటున్నారు. అంతేకాదు, ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత అసలు నమోదు కాలేదని మరికొందరు చెప్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us