షాయాజీ షిండేకు చిరంజీవి చేసిన సాయమేంటో తెలుసా..? ఎమోషనల్ వీడియో
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిది ఒక ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత అంతటి స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న నటుడాయన. సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ కు కష్టంవిలువ బాగా తెలుసు. అందుకే సినిమాల్లోకి రావాలనుకునే వారికి తన వంతు సహాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు షాయాజీ షిండే కెరీర్‌కి కూడా చిరంజీవి హెల్ప్ చేశారట.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిది ఒక ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత అంతటి స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న నటుడాయన. సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ కు కష్టంవిలువ బాగా తెలుసు. అందుకే సినిమాల్లోకి రావాలనుకునే వారికి తన వంతు సహాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు షాయాజీ షిండే కెరీర్‌కి కూడా చిరంజీవి హెల్ప్ చేశారట. ఈ విషయాన్ని షిండేనే చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంలో షాయాజీ షిండే విలన్ గా నటించారు. ఆయనకు ఇదే మొదటి సినిమా. అయితే షాయాజీది నార్త్ ఇండియా కావడంతో తెలుగు రాదు. దీంతో ఠాగూర్ సినిమా సెట్ లో చాలా ఇబ్బంది పడ్డారట. ఇది గమనించిన చిరంజీవి ఆయనను దగ్గరికి పిలిచి, దేని గురించైనా కంగారు పడుతున్నావా? అని అడిగారట. దీనికి ‘ ఆయన అవును సార్.. నేను రంగ స్థలం నటుడిని. డైలాగ్ అర్థం కాకపోతే ముఖంలో భావోద్వేగాలను పలికించలేను. చాలా ఇబ్బందిగా ఉంది’ అనిచెప్పారట. దీంతో వెంటనే చిరంజీవి డైరెక్టర్ వివి వినాయక్ ని పిలిపించి తెలుగు ట్రైనర్ ని ఏర్పాటు చేశారట. సినిమా స్క్రిప్ట్ లో ఉన్న ప్రతి డైలాగ్ ని షిండేకి అర్థం అయ్యేలా నేర్పించారట.
డబ్బింగ్ విషయంలోనూ షాయాజీకి చాలా హెల్ప్ చేశారట చిరంజీవి. తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి వేరే వాళ్లని వెతుకుతోన్న సమయంలో చిరంజీవి దగ్గరకు వెళ్లిన ఆయన ‘సర్.. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. వేరే వాళ్లు డబ్బింగ్ చెబితే నా బాడీ లాంగ్వేజ్ కు సెట్ కాదు. ఛాన్స్ ఇస్తే ట్రై చేస్తాను’ అని రిక్వెస్ట్ చేశారట. దీనికి వెంటనే ఓకే చెప్పారట చిరంజీవి. డబ్బింగ్ పూర్తి చేసేందుకు 15 రోజుల సమయం తీసుకున్నా ఎంతో ఓపికగా ఏమీ అనకుండా షాయాజీని ఎంకరేజ్ చేశారట మెగాస్టార్. కాగా చిరంజీవి ఠాగూర్ సినిమా తర్వాత తనకి తెలుగులో ఒక్కసారిగా పది చిత్రాల్లో ఆఫర్ వచ్చినట్లు షాయాజీ షిండే తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

