Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election 2024 Results: ‘ఇక మీ లగేజ్‌ సర్దుకోండి..’ గెలిచి చూపించిన బాలీవుడ్ క్వీన్‌! నటి ఫస్ట్ రియాక్షన్ ఇదే

ప్రముఖ బాలీవుడ్‌ నటి, బీజేపీ నేత కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల్లో మండి స్థానం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో కంగనా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై భారీ మెజారిటీతో గెలుపు బావుటా ఎగురవేశారు. విక్రమాదిత్య సింగ్ కంటే దాదాపు 72,696 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు...

Lok Sabha Election 2024 Results: 'ఇక మీ లగేజ్‌ సర్దుకోండి..' గెలిచి చూపించిన బాలీవుడ్ క్వీన్‌! నటి ఫస్ట్ రియాక్షన్ ఇదే
Actress Kangana Ranaut
Srilakshmi C
|

Updated on: Jun 04, 2024 | 5:34 PM

Share

ప్రముఖ బాలీవుడ్‌ నటి, బీజేపీ నేత కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల్లో మండి స్థానం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో కంగనా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై భారీ మెజారిటీతో గెలుపు బావుటా ఎగురవేశారు. విక్రమాదిత్య సింగ్ కంటే దాదాపు 72,696 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇప్పటి వరకు కంగనాకు 5,25,691 ఓట్లు వచ్చాయి. దీనిపై కంగనా సోషల్‌ మీడియాలో తొలిసారి స్పందించారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.

ఇన్‌ స్టా ఖాతాలో కంగనా మండి ప్రజలతో కలిసి కనిపించారు. ‘మండిలోని నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేశారు. ‘మీ మద్దతు, ప్రేమ, నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది మీ అందరి విజయం. ఇది ప్రధాని మోదీ జీ, బీజేపీపై ఉంచిన విశ్వాసానికి చెందిన విజయం. ఇది సనాతన్ విజయం’… అంటూ తన విజయం పట్ల మండి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు నటి కంగనా రనౌత్ విజయం పట్ల పలువురు సోషల్ మీడియా వేదికలగా అభినందనలు తెలుపుతున్నారు. కంగనా రనౌత్ విజయం సాధించినందుకు ఆమెకు నటుడు అనుపమ్‌ ఖేర్‌ అభినందనలు తెలిపారు. ‘నువ్వొక రాక్‌స్టార్. నీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. నీకు, మండి ప్రజలకు శుభాకాంక్షలు. ఎవరైనా తన పనిని ఏకాగ్రతతో చేస్తే ఏదైనా సాధించవచ్చని నువ్వు నిరూపించావు’ అని తన పోస్టులో తెలిపాడు. KRK కూడా ఎన్నికల్లో గెలిచినందుకు కంగనా రనౌత్‌కు అభినందనలు తెలిపాడు. తాను నిజమైన రాజ్‌పుత్ అని, పోరాట యోధురాలని మరోసారి నిరూపించుకున్నట్లు పేర్కొన్నాడు. ఓడిపోవడం తనకు తెలియదని మరోమారు నిరూపించిందని కంగనాను ప్రశంశల్లో ముంచెత్తాడు. ఆమెను సమాచార, ప్రసార శాఖ మంత్రిగా చూడాలని ఉందని తన పోస్టులో పేర్కొన్నాడు.

ఇక లోక్‌సభ ఫలితాలు రాకముందే కంగనా విజయం దాదాపు ఖరారైపోయింది. దీంతో ఆమె తల్లి ఆశీస్సులు తీసుకుంటున్న రెండు వీడియోలను కంగనా తన ఇన్‌స్టా స్టోరీలో రెండు పోస్ట్‌లు షేర్‌ చేసింది. అందులో ఆమె తల్లి కంగనాకు పెరుగు – పంచదార తినిపించి ఆశీస్సులు అందించడం కనిపిస్తుంది. అమ్మ దేవునికి మరో రూపం అంటూ తన పోస్టులో

కంగనా రనౌత్ సినిమాలకు గుడ్‌బై చెప్పేనా?

కాగా మండి స్థానం నుంచి తాను గెలిస్తే రాజకీయాలపైనే పూర్తి దృష్టి సారిస్తానని కంగనా రనౌత్ ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఎన్నికల ఫలితాలు కంగనాకు అనుకూలంగా రావడంతో ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ త్వరలోనే కంప్లీట్ చేసి యాక్టింగ్‌కు స్వస్తి చెప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో నిజంగానే కంగనా నటనను వదిలివేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి