AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rupert Murdoch: 93 ఏళ్ల పడిలో ఐదో పెళ్లి చేసుకున్న దిగ్గజ వ్యాపారవేత్త.. 67 యేళ్ల ప్రియురాలితో ఏడాదిగా డేటింగ్!

మీడియా టైకూన్‌గా పేరు గాంచిన దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 93 ఏండ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకున్నారు. కాలిఫోర్నియాలోని తన ఫామ్‌హౌస్‌లో 67 యేళ్ల ప్రియురాలు ఎలీనా జుకోవాను వివాహమాడారు. వీరిద్దరి మధ్య దాదాపు 26 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఎలీనా రిటైర్డ్‌ జీవశాస్త్రవేత్త. ఈ ముసలి జంట గత ఏడాదిగా డేటింగ్‌లో ఉన్నారట. వీరి వివాహానికి అమెరికా ఫుట్‌బాల్‌ టీమ్‌ ‘న్యూ ఇంగ్లాండ్‌ పేట్రియాట్స్‌’ యజమాని..

Rupert Murdoch: 93 ఏళ్ల పడిలో ఐదో పెళ్లి చేసుకున్న దిగ్గజ వ్యాపారవేత్త.. 67 యేళ్ల ప్రియురాలితో ఏడాదిగా డేటింగ్!
Media Mogul Rupert Murdoch
Srilakshmi C
|

Updated on: Jun 03, 2024 | 5:46 PM

Share

పోర్చుగల్‌, జూన్‌ 3: మీడియా టైకూన్‌గా పేరు గాంచిన దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 93 ఏండ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకున్నారు. కాలిఫోర్నియాలోని తన ఫామ్‌హౌస్‌లో 67 యేళ్ల ప్రియురాలు ఎలీనా జుకోవాను వివాహమాడారు. వీరిద్దరి మధ్య దాదాపు 26 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఎలీనా రిటైర్డ్‌ జీవశాస్త్రవేత్త. ఈ ముసలి జంట గత ఏడాదిగా డేటింగ్‌లో ఉన్నారట. వీరి వివాహానికి అమెరికా ఫుట్‌బాల్‌ టీమ్‌ ‘న్యూ ఇంగ్లాండ్‌ పేట్రియాట్స్‌’ యజమాని రోబెర్ట్‌ క్రాఫ్ట్‌, ఆయన సతీమణి డానా బ్లూమ్‌బెర్గ్‌ హాజరయ్యారు.

ముర్దోక్‌కు ఇది ఐదో పెళ్లి. తన మాజీ భార్యల ద్వారా ఆరుగురు సంతానానికి తండ్రి అయ్యాడు. తొలుత ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ ప్యాట్రిసియా బుకర్‌ను ముర్డొక్‌ వివాహం చేసుకున్నాడు. 1960లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వార్తపత్రిక రిపోర్టర్‌ అన్నా టోర్వ్‌ను రెండో పెళ్లి చేసుకోగా వీరు 30 యేళ్లపాటు కలిసి ఉన్నారు. 1999లో రెండో భార్యకు విడాకులు ఇచ్చాడు. మూడో భార్య వెండి డెంగ్‌కు 2013లో విడాకులిచ్చి.. 2016లో రోలింగ్ స్టోన్స్ ఫ్రంట్‌మ్యాన్ మిక్ జాగర్ ఎక్స్‌ వైఫ్‌ మోడల్ జెర్రీ హాల్‌ (65)ని నాలుగో వివాహం చేసుకున్నాడు. ఆరేళ్లకే వీరి బంధానికి ముగింపు పలికారు. గతేడాది ఏప్రిల్‌లో మాజీ పోలీసు అధికారి ఆన్ లెస్లీ స్మిత్‌ (65)తో ఎంగేజ్‌మెంట్‌ రద్దైంది. అనంతరం తన మాజీ భార్యల్లో ఒకరైన విన్‌డీ డెంగ్‌ ఇచ్చిన పార్టీలో మర్దోక్‌కు జుకోవా పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఎలీనాతో డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. రష్యా నుంచి యూఎస్‌కు వలస వచ్చిన ఎలీనా రిటైర్డ్‌ మాలిక్యులర్‌ బయాలజిస్ట్‌. గతంలో ఆమెకు మాస్కో ఆయిల్‌ బిలియనీర్‌ అలెగ్జాండర్‌తో వివాహమైంది.

తన రెండో భార్య అన్నా మరియా మన్‌ నుంచి విడిపోయిన సందర్భంలో మర్దోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైనవాటిల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. ఫోర్బ్స్ 2023 నివేదికల ప్రకారం.. మర్దోక్ ఆస్తుల నికర విలువ 17.7 బిలియన్ల డాలర్లు. మర్దోక్‌కు ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలు ఉన్నాయి. గతేడాది నవంబర్‌లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారుడు లాచ్‌లాన్‌కు అప్పగించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..