AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Karunas: ఎయిర్‌పోర్టులో బుల్లెట్లతో పట్టుబడ్డ ప్రముఖ నటుడు.. వీడియో వైరల్

ప్రముఖ తమిళ సీనియర్ న‌టుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్‌ను పోలీసులు ఆదివారం (జూన్‌ 2) అరెస్ట్‌ చేశారు. ఎయిర్‌ పోర్టులో ఆయన లగేజీని తనఖీ చేయగా అత‌డి బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్లు భద్రతా అధికారులు గుర్తించారు. తిరుచ్చి వెళ్లేందుకు నేడు ఉద‌యం చెన్నై విమానాశ్రయానికి నటుడు కరుణాస్‌ చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్టులో సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా అధికారులు కరుణాస్‌ లగేజీ సోదా చేశారు. ఆయనతోపాటు..

Actor Karunas: ఎయిర్‌పోర్టులో బుల్లెట్లతో పట్టుబడ్డ ప్రముఖ నటుడు.. వీడియో వైరల్
Actor Karunas
Srilakshmi C
|

Updated on: Jun 02, 2024 | 6:29 PM

Share

ప్రముఖ తమిళ సీనియర్ న‌టుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్‌ను పోలీసులు ఆదివారం (జూన్‌ 2) అరెస్ట్‌ చేశారు. ఎయిర్‌ పోర్టులో ఆయన లగేజీని తనఖీ చేయగా అత‌డి బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్లు భద్రతా అధికారులు గుర్తించారు. తిరుచ్చి వెళ్లేందుకు నేడు ఉద‌యం చెన్నై విమానాశ్రయానికి నటుడు కరుణాస్‌ చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్టులో సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా అధికారులు కరుణాస్‌ లగేజీ సోదా చేశారు. ఆయనతోపాటు తీసుకొచ్చిన హ్యాండ్‌ బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

మొత్తం ఆ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు ఉన్నట్లు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. దీంతో హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న 40 బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన ప్రయాణాన్ని కూడా రద్దు చేశారు. ప్రస్తుతం తమిళనాడులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున బుల్లెట్లు కలిగి ఉండటం నేరంగా భావించి అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై భద్రతా అధికారులు కరుణాస్‌ను వివరణ కోరగా.. తన రక్షణ కోసమే లైసెన్స్‌ ఉన్న తుపాకీ వాడుతున్నానని, అయితే తన హ్యాండ్‌ బ్యాగ్‌లోని బుల్లెట్లు పొరబాటున తనతోపాటు తీసుకొచ్చానని అధికారులకు తెలిపాడు. తన వద్ద ఉన్న తుపాకీని డిండిగల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించానని, అందుకు సంబంధించిన పత్రాలను కూడా నటుడు కరుణాస్‌ భద్రతా అధికారులకు తెలిపాడు. భద్రతా సిబ్బంది అతని వద్ద ఉన్న ధృవీకరణ పత్రాలను పరిశీలించి, వాటిని దిండిగల్‌ పోలీస్ స్టేషన్‌తో నిర్ధారించారు. అనంతరం కరుణాస్‌ చెప్పినదంతా నిజమేనని తేలడంతో భద్రతా సిబ్బంది అతన్ని తిరుచ్చి వెళ్లేందుకు అనుమతించారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్