AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raveena Tandon: రవీనా టాండన్‌పై దాడి.. ‘ప్లీజ్ కొట్టొద్దు’ అని బతిమాలుకున్న కేజీఎఫ్ నటి.. వీడియో వైరల్

' కేజీఎఫ్ 2 ' సినిమాలో పవర్ ఫుల్ 'రమిక' పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ వివాదంలో చిక్కుకుంది. శనివారం (జూన్ 01) రాత్రి రవీనా టాండన్ ప్రయాణిస్తున్న కారు ముగ్గురు మహిళలను ఢీకొట్టిందని సమచారం. వీరికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది

Raveena Tandon: రవీనా టాండన్‌పై దాడి.. 'ప్లీజ్ కొట్టొద్దు' అని బతిమాలుకున్న కేజీఎఫ్ నటి.. వీడియో వైరల్
Actress Raveena Tandon
Basha Shek
|

Updated on: Jun 02, 2024 | 5:03 PM

Share

‘ కేజీఎఫ్ 2 ‘ సినిమాలో పవర్ ఫుల్ ‘రమిక’ పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ వివాదంలో చిక్కుకుంది. శనివారం (జూన్ 01) రాత్రి రవీనా టాండన్ ప్రయాణిస్తున్న కారు ముగ్గురు మహిళలను ఢీకొట్టిందని సమచారం. వీరికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. బదులుగా బాధితులు రవీనా కారును ఆపి వారిపై దాడి చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రవీనా టాండన్ తో బాధితులు గొడవపడుతున్నట్లు కనిపిస్తోంది. రవీనా కూడా బయటకు వచ్చి గాయపడిన మహిళలపై మళ్లీ దాడి చేసిందని అక్కడున్నస్థానికులు ఆరోపిస్తున్నారు. ‘నా పేరు మహమ్మద్. నేను బాంద్రా నివాసిని. మా అమ్మ, చెల్లి తదితరులతో కలిసి బయటకు వెళ్లాం. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా, రవీనా టాండన్ కారు మా అమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె ముక్కు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత కూడా రవీనా టాండన్ కారు డ్రైవర్ మా అమ్మను కొట్టాడు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న రవీనా టాండన్ కూడా బయటకు వచ్చి అమ్మపై దాడి చేసింది. రవీనాపై ఫిర్యాదు చేయడానకి నాలుగు గంటల నుంచి ఇక్కడే పోలీస్‌స్టేషన్‌ ముందు నిల్చున్నాం. నా మాట ఎవరూ వినడం లేదు. మా ఫిర్యాదులను ఎవరూ స్వీకరించడం లేదు. రాజీ అంటున్నారు. మనం ఎందుకు రాజీపడాలి? మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం’ అని మహ్మద్ ఈ వైరల్ వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

అయితే ఇదే వీడియోలో రవీనా టాండన్ చుట్టూ చాలా మంది గుమిగూడి రవీనా డ్రైవర్‌పై దాడికి ప్రయత్నిస్తున్నారు. రవీనాపై కూడా దాడికి యత్నించారు. దీంతో ఆమె దయచేసి నన్ను కొట్టవద్దని వారిని వేడుకుంది. వీడియోలను రికార్డ్ చేయవద్దని అక్కడున్న వారిని కోరింది. అయితే ఈ గొడవలో రవీనా గాయపడిందా లేక ఆమె డ్రైవర్ గాయపడ్డారా అనేది తెలియరాలేదు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం. అలాగే తనపై జరిగిన దాడి నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.