AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddhartha: నిఖిల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. యుద్ధం చేసే కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. వీడియో

తెలుగులో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. కార్తి కేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడీ ట్యాలెంటెడ్ హీరో. ఆ తర్వాత 18 పేజేస్ లాంటి ప్రేమకథతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైన స్పై నిరాశ పరిచినా నిఖిల్ నటనకు ప్రశంసలు దక్కాయి

Nikhil Siddhartha: నిఖిల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. యుద్ధం చేసే కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. వీడియో
Nikhil Siddhartha
Basha Shek
|

Updated on: Jun 05, 2024 | 1:03 PM

Share

తెలుగులో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. కార్తి కేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడీ ట్యాలెంటెడ్ హీరో. ఆ తర్వాత 18 పేజేస్ లాంటి ప్రేమకథతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైన స్పై నిరాశ పరిచినా నిఖిల్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు స్వయంభూ అంటూ మరో పాన్ ఇండియా మూవీతో మన ముందుకు వస్తున్నాడు నిఖిల్. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సంయుక్తా మేనన్, నభా నటేష్ హీరోయిన్లు గా నటిస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ స్వయంభూ పై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే శనివారం (జూన్ 1) నిఖిల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా స్వయంభూ సినిమాకు సంబంధించి నిఖిల్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కత్తి తిప్పుతున్న యోధుడి లుక్ లో నిఖిల్ సూపర్బ్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట బాగా వైరలవుతోంది.

ఇదిలా ఉంటే స్వయంభు షూటింగ్ సెట్ లో నిఖిల్ పుట్టిన రోజు వేడకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యుద్ధం చేసే పెద్ద కత్తితో నిఖిల్ తన బర్త్ డే కేక్ ను కట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. స్వయం భూ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్‌, శ్రీకర్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘బాహుబలి, ఆర్‌ర్‌ఆర్‌’ వంటి చిత్రాలకు పని చేసిన కేకే సెంథిల్‌ కుమార్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరిస్తున్నారు. అలాగే కేజీఎఫ్, సలార్ సినిమాలకు సంగీతం అందించిన రవి బ్రసూర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయినట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్